Sunday, April 2, 2023

gqg partners rajiv jain, Adani Group లో ఇప్పుడు వేల కోట్ల వాటా కొన్నదెవరు? ఆ వ్యూహంతోనే పకడ్బందీగా..! – meet gqg partners rajiv jain, a global investor that bets 1.87 billion dollars on beleaguered adani group


Adani Group: అమెరికా షార్ట్ సెల్లర్ Hindenburg Research ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీల్లో అమెరికా కేంద్రంగా నడిచే ఒక సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్ (GQG Partners) పెద్ద ఎత్తున వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.15,446 కోట్లు కావడం గమనార్హం. సెకండరీ మార్కెట్ లావాదేవీలుగా పిలిచే బ్లాక్ డీల్స్ ద్వారా.. అదానీ గ్రూప్ షేర్లను దక్కించుకొని వాట్ సొంతం చేసుకున్నట్లయింది. అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో కోట్లాది షేర్లను దక్కించుకుంది.

అయితే అదానీ గ్రూప్ షేర్లు వరుసగా పడిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం తిరిగి నింపేందుకు గౌతమ్ అదానీ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు జీక్యూజీ రూపంలో వాటా కొనుగోలు చేయడం పెద్ద ఊరటనిచ్చే విషయంగా చెప్పొచ్చు. అదానీ ప్రయత్నాలకు ఇది ఊతమిచ్చే అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ బ్లాక్ డీల్స్ అనంతరం శుక్రవారం సెషన్‌లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అసలు జీక్యూజీ ఏంటి? వారి వ్యూహం ఏంటి? దీనిని నడిపించేదెవరో తెలుసుకుందాం.

అమెరికా కేంద్రంగా నడిచే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ GQG Partners. అయితే ఇది మాత్రం ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదై ఉంది. ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్లు పెడుతుంటుంది. ఇది తమ క్లయింట్లకు భారీ రాబడులు అందించినట్లు కంపెనీ చెబుతోంది.

ఈ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థను స్థాపించింది భారతీయుడే. భారత సంతతికి చెందిన రాజీవ్ జైన్ 2016లో దీనిని స్థాపించగా.. ఆయనే ప్రస్తుతం ఛైర్మన్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు. అంతకుముందు ఆయన వోంటోబెల్ అనే ఒక కంపెనీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 22 సంవత్సరాల పాటు అందులోనే పనిచేశారు. దాని కంటే ముందు స్విస్ బ్యాంకు కార్పొరేషన్‌లో ఈక్విటీ అనలిస్ట్‌గా చేశారు. ఇక జైన్.. భారత్‌లోనే జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీలో ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్‌లో MBA పూర్తి చేశారు. ఇక చాలా సాధారణ జీవితం గడుపుతుంటారు. జైన్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదు. టీవీ షోల్లో కూడా పెద్దగా కనిపించరు. తన పెట్టుబడి వ్యూహాలతోనే.. 92 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థగా నిలబెట్టారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో Adani Group భారీ పెట్టుబడులు.. విశాఖపట్నం, కడప సహా వారికి గుడ్‌న్యూస్Holi: వచ్చే వారం 5 రోజులు బ్యాంకులు బంద్.. మొత్తం లిస్ట్ ఇదే.. ఆ పనులుంటే త్వరగా చూస్కొండి..

ఇక క్లయింట్స్ పెట్టుబడులు గణనీయంగా పెంచడమే లక్ష్యంగా .. ఫార్వర్డ్ లుకింగ్ క్వాలిట అనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు జైన్ గతంలో వెల్లడించారు. రానున్న ఐదేళ్లు, ఆ తర్వాత కూడా విజయవంతంగా నడుస్తుందన్న అంచనాలతోనే సదరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతామని ఆయన చెప్పారు. ఇక ఇటీవల జైన్.. ఇంధన రంగంపై ప్రధానంగా దృష్టి సారించారు. సహజ ఇంధన వనరుల నుంచి.. కర్బన ఉద్గార రహిత ఇంధనంవైపు ప్రపంచం మారుతున్న తరుణంలో.. ఆయన ఈ రంగంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇంకా బ్యాంకింగ్ సెక్టార్‌పైనా ఆయన ఆసక్తిగానే ఉన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ వంటి ఇంధన రంగాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. అందుకే తాము కూడా అందులో పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు.

Dhoni, Sachin, ఆలియా భట్ పేర్లతో హైటెక్ మోసం.. అంతా పాన్ కార్డు చుట్టూరానే.. ఇలా కాపాడుకోండి?

ఇక హిండెన్‌బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ కూడా అదానీ గ్రూప్‌పై పెద్దగా ఉండదని జైన్.. ఇటీవల బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు.. ఈ గ్రూప్‌లో బ్యాంక్స్ ఎక్స్‌పోజర్ కూడా ఒక శాతం కంటే తక్కువే ఉందని.. ఇది దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ముప్పుగా లేదన్నారు.



Source link

Latest news
Related news