పెట్టుబడుల వివరాలు…
ప్రధాన పెట్టుబడిదారులలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రూ. 2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఏబీసీ లిమిటెడ్ రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడితో ఎంఓయూపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధి కల్పించబోతోంది. JSW గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పించనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్ల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 5,250 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ 2,850 మందికి ఉపాధి కల్పించే రూ.9,300 కోట్ల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే ఎంఓయూపై సంతకం చేసింది. మొదటి రోజు మొత్తం 64 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.