Sunday, April 2, 2023

airbnb layoffs, Layoffs at Airbnb: కంపెనీకి భారీ లాభాలొచ్చినా.. 30 శాతం ఉద్యోగులు అవుట్.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు..! – layoffs at airbnb 30 percent of recruiting employees sacked despite a surge in profit


Layoffs at Airbnb:ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) తన రిక్రూటింగ్ స్టాఫ్‌లో 30 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. భారీ లాభాలొచ్చినప్పటికీ ఉద్యోగుల్ని పీకేయడం గమనార్హం. 2022 సంవత్సరంలోనే ఈ వెకేషన్ రెంటల్ కంపెనీకి తొలిసారి లాభం రావడం విశేషం. గతేడాది కంపెనీ నికర ఆదాయం 1.9 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత కరెన్సీలో రూ.15 వేల కోట్లకుపైనే. ఈ కంపెనీకి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6800గా ఉంది. అయితే తొలగించిన ఉద్యోగుల సంఖ్య పెద్దగా ఇతర ఉద్యోగులపై ప్రభావం చూపదని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇక ఫిబ్రవరిలో వచ్చిన ఈ రిపోర్ట్ చాలా మంది ఉద్యోగుల్ని షాక్‌కు గురిచేసింది. అయితే ఈ ఏడాది మాత్రం తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉందంట.

మరోవైపు Airbnb చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ చెస్కై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి ప్రభావం కంపెనీ వ్యాపారాలపై, కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డేవ్ స్టీఫెన్‌సన్ మరో విధంగా స్పందించారు. ప్రస్తుతం కంపెనీకి లాభాలను బట్టి చూస్తే.. ఇంకా చాలా మందిని నియమించుకునేందుకు ఛాన్స్ ఉందని అన్నారు. తమ కంపెనీ మరింత వృద్ధిని నమోదు చేస్తుందని, కానీ అది క్రమక్రమంగా సాధించుకుంటూ వెళ్తామని చెప్పారు. గతేడాది హెడ్‌కౌంట్ 11 శాతం పెరగ్గా.. ఈ ఏడాది అది 2 నుంచి 4 శాతం వరకు ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ కరోనా సమయంలో 25 శాతం ఉద్యోగులను తొలగించింది. దానిపై కూడా కంపెనీ విచారం వ్యక్తం చేసింది.

Mukesh Ambanis Driver: ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వారందరి కంటే ఎక్కువ.. ఐటీ ఉద్యోగులకు మించి..!Adani Enterprises Share: 5 రోజుల్లో 43 శాతం పెరిగిన అదానీ స్టాక్.. 3 రోజుల్లో రూ.1.42 లక్షల కోట్ల లాభం.. మామూలుగా లేదుగా..

మరోవైపు అల్ఫాబెట్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ యూనిట్ Waymo.. తన రెండో రౌండ్ ఉద్యోగాల కోతల్లో భాగంగా 137 మందిని తీసేసింది. ఎక్కువగా ఇంజినీరింగ్ విభాగాల్లో కోతలు విధించింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ కంపెనీ 209 మందిని లేఆఫ్ చేసింది. అల్ఫాబెట్ మొత్తంగా ఈ ఏడాది జనవరిలో 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గత నెలలో ట్విట్టర్ 200 మందిని తీసేసింది. గతేడాది నవంబర్‌లో ఏకంగా 3700 మంది ఉద్యోగుల్ని తొలగించుకుంది. అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతోందన్న అంచనాలు పెరిగిపోయాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకే కంపెనీలు కాస్ట్ కటింగ్స్ చేస్తున్నాయి. చాలా కంపెనీల సీఈఓలు కూడా తమ వార్షిక వేతనాల్లో భారీగా కోతలు కూడా విధించుకుంటున్నారు.



Source link

Latest news
Related news