Thursday, March 30, 2023

adani group market capitalisation, Adani Enterprises Share: 5 రోజుల్లో 43 శాతం పెరిగిన అదానీ స్టాక్.. 3 రోజుల్లో రూ.1.42 లక్షల కోట్ల లాభం.. మామూలుగా లేదుగా.. – adani enterprises zooms 43 percent in 5 days, group mcap jumps over rs. 1.42 lakh crore


Adani Enterprises Share: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి మళ్లీ సానుకూల పవనాలు వీస్తున్నాయి. గ్రూప్‌ షేర్లలో మునుపటి జోష్ కనిపిస్తోంది. అదానీ గ్రూప్‌లో కీలకమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు గత 5 సెషన్లలో ఏకంగా 43.28 శాతం మేర పెరిగింది. అన్నీ సానుకూల సంకేతాల నేపథ్యంలో పెరుగుతుండటం విశేషం. గత 3 ట్రేడింగ్ సెషన్లలోనే అదానీ గ్రూప్‌లో ఉన్న 10 కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.1.42 లక్షల కోట్ల మేర పెరిగింది. శుక్రవారం సెషన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఏకంగా 17 శాతం పుంజుకొని BSE లో రూ.1879.35 వద్ద స్థిరపడింది. దీనికి కారణం అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్ (GQG Partners) .. అదానీ గ్రూప్‌లోని 4 కంపెనీల్లో ఏకంగా రూ.15,446 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. దీంతోనే గ్రూప్ స్టాక్స్‌లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది.

అదానీ గ్రూప్‌లోని ఇతర షేర్ల విషయానికి వస్తే అదానీ పోర్ట్స్ 9.81 శాతం పెరిగింది. అంబుజా సిమెంట్స్ షేరు 5.70 శాతం పుంజుకుంది. ACC స్టాక్ ధర రూ.5.11 శాతం లాభపడింది. అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు 5 శాతం పుంజుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం అప్పర్‌సర్క్యూట్ కొట్టింది. అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం పెరిగింది. అదానీ పవర్ కూడా 4.99 శాతం, అదానీ విల్మర్ 4.99 శాతంతో అప్పర్‌సర్క్యూట్ కొట్టాయి. NDTV కూడా 4.98 శాతం మేర పెరిగింది.

ఇక అదానీ గ్రూప్‌లోని చాలా కంపెనీల షేర్లు గత కొన్ని సెషన్లుగా అప్పర్‌సర్క్యూట్ కొడుతూనే ఉన్నాయి. క్రితం రోజు స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే BSE సెన్సెక్స్ 899.62 పాయింట్లు పెరిగి రూ.59,808 వద్ద స్థిరపడింది. జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. భారత స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని ఆరోపించింది. అప్పటినుంచి గ్రూప్ స్టాక్స్ పతనం అవుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.12 లక్షల కోట్ల వరకు పడిపోయింది కూడా. ఇక గత నాలుగైదు రోజులుగా మాత్రమే స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయి. GQG పార్ట్‌నర్స్.. బ్లాక్ లావాదేవీలతోనే ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగినట్లు ఉందని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే కొద్దిరోజుల్లో తాము ఇంధన రంగంపై దృష్టి సారించామని, అదానీ గ్రూప్ ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టినందున తాము ఆ గ్రూప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లు చెప్పుకొచ్చారు GQG పార్ట్‌నర్స్ ఛైర్మన్ రాజీవ్ జైన్.



Source link

Latest news
Related news