Tuesday, March 21, 2023

aadhaar card update, Telangana లో కోటి మంది ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోలేదట.. మీరు చేసుకున్నారా మరి? లేకుంటే కష్టం! – one crore people in telangana have not updated their aadhaar yet, is it mandatory or not


Telangana: ఆధార్ కార్డు.. భారత పౌరులకు ఇది తప్పనిసరి. గుర్తింపుకార్డుగా పనిచేయడమే కాకుండా.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, పాన్ కార్డు కావాలన్నా ఇది అవసరం పడుతుంది. ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు లబ్ధిదారులుగా చేరాలన్నా.. ఆధార్ కార్డు చాలా వరకు అడుగుతుంటారు. అయితే అందులో ఎలాంటి తప్పులు లేకుండా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. అందులో సమాచారం ఏదన్నా మారితే అప్‌డేట్ చేసుకోవాల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆధార్ కార్డుదారులు ఒక్కసారైనా తమ సమాచారం అప్‌డేట్ చేసుకోలేదని అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. అసలు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే పదేళ్లకు ఒకసారి తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గతేడాది నవంబర్‌లో సూచించింది. ఇది సూచన మాత్రమే. తప్పనిసరి కాదు. అయితే ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు అయితే అప్‌డేట్ చేసుకోవడం మంచిదని స్పష్టం చేసింది. అంటే ఈ పదేళ్లలో ఇంటి చిరునామా మారడమో, మొబైల్ నంబర్ మారడమో, పేర్లు తప్పుంటే అప్‌డేట్ చేయడమో, స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటివి ఉంటే అప్‌డేట్ చేసుకోమని చెప్పింది. తప్పనిసరి కాకపోయినా చేసుకుంటే మాత్రం ఎలాంటి చిక్కులు ఎదురుకావు.

దీంతో రాష్ట్రంలో ఆధార్ కార్డు తీసుకొని ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోని వారిపై అధికారులు దృష్టి సారించారు. తెలంగాణలో 2022 డిసెంబర్ వరకు జనాభా 3,79,07,000 ఉంటే.. అందులో 3,84,47,793 మంది ఆధార్ కార్డులను తీసుకున్నారు. అయితే జనాభా కంటే కార్డులు ఎక్కువగా ఉండటానికి కారణం.. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చి ఇక్కడే ఉద్యోగం, వ్యాపారాలు చేసుకునే వారు ఇక్కడే ఆధార్ తీసుకొని ఉంటారని చెబుతున్నారు అధికారులు.

Adani Group లో ఇప్పుడు వేల కోట్ల వాటా కొన్నదెవరు? ఆ వ్యూహంతోనే పకడ్బందీగా..!SBI అదిరిపోయే కొత్త స్కీం.. ఇతర పథకాల కంటే అధిక ప్రయోజనం.. ఏం చేయాలంటే?

ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. దీంతో గడిచిన పదేళ్లలో ఎందరు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకున్నారో చూడాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందుతున్న వారి జాబితాను జిల్లాల వారిగా UIDAI అధికారులకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సదరు జాబితాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు అధికారులు.

ఇక ఆధార్‌లో సమాచారం అప్‌డేట్ చేసుకోవాలంటే.. ఆధార్ లేదా E-సేవా, Mee సేవా కేంద్రాలకు వెళ్లొచ్చు. ఆన్‌లైన్‌లోనూ www.uidai.gov.in వెబ్‌సైట్‌లో మైఆధార్ విభాగంలోకి వెళ్లి ఈ అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో మీ ఆధార్ వివరాలు అప్‍‌డేట్ చేయండిలా
తొలుత https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఆధార్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
ఆన్‌లైన్ అప్‌డేట్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి.
అక్కడ Update Aadhaar Online పై క్లిక్ చేయాలి.
ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్‌పై నొక్కాలి.
నేమ్, లింగం, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఆప్షన్స్‌లో అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలక్ట్ చేయాలి.
వివరాలు అప్‌డేట్ చేసి.. అవసరమైన అడిగిన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
చివరగా పేమెంట్ కట్టి ప్రాసెస్ పూర్తి చేస్తే సరిపోద్ది.

Aadhaar Card Update: ఆధార్ కార్డు గురించి ఏదైనా సమస్య ఉందా? జస్ట్ ఈ నంబర్‌కు ఒక్క ఫోన్ కాల్‌ చేస్తే చాలు..



Source link

Latest news
Related news