అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్న వేళ.. పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. కనేరియా పోస్టుకు హర్షం వ్యక్తం చేస్తూ రామభక్తులు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
బంగ్లాదేశ్ జట్టులో ఏకైక హిందూ క్రికెటర్ లిట్టన్ దాస్ (Liton Das) ఇదేవిధంగా కిందటేడాది దసరా సందర్భంగా తన హిందూయిజాన్ని చాటుకున్నాడు. దేవీ నవరాత్రుల సందర్భంగా కాళీ మాతా ఫోటో షేర్ చేస్తూ.. హిందువులకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, బంగ్లాదేశ్ వాసులు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. భారత్‌కు వెళ్లిపో అంటూ దూషించారు. బంగ్లాదేశ్ ఒకనాడు భారత్‌లో భాగమే (భారత్ విడిపోవడానికి ముందు). పైగా పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రం పొందడానికి సాయం చేసింది కూడా మన దేశమే. ఆ కృతజ్ఞత కూడా లేకుండా బంగ్లాదేశ్ వాసులు దారుణ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ క్రికెటర్ డానిష్ కనేరియాకు మాత్రం.. అలాంటి దూషణలు ఎదురుకాకపోవడం గమనార్హం. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 19న కూడా కనేరియా ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ మహా శివరాత్రి. హర హర మహదేవ్. బోలా బాబా.. ఈ బ్రహ్మాండానికి అంతటికీ మీరే శక్తి’ అంటూ పోస్టు చేశాడు. కనేరియా పూర్తి పేరు – డానిష్ పరభా శంకర కనేరియా.