Thursday, March 30, 2023

చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..? వెల్లుల్లి నూనెతో చెక్‌ పెట్టండి..!

Garlic Oil: మనం వంటల్లో అనేక సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యానికి ప్రత్యేకమైన రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లి కూడా అటువంటి అద్భుతమైన మసాలాలో ఒకటి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాదు, దానిలోని ఔషధ గుణాలు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వెల్లుల్లిలో ప్రోటీన్‌, విటమిన్‌ B1, B2, B3, B5, B6, B9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, సెలీనియం. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీపరాసిటిక్ , యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలాగే వెల్లుల్లి నూనెలోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వెల్లుల్లి నూనె… అనేక అనారోగ్యాలను, చర్మం, జుట్టు సమస్యలను నయం చేస్తుందని ఫ్యాట్‌ టూ స్లిమ్‌ డైరెక్టర్‌, పోషకహార నిపుణురాలు, డైటీషియన్‌ శిఖా అగర్వాల్‌ శర్మ అన్నారు. వెల్లుల్లి నూనె ఉపయోగించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు, ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేద్దాం.

చర్మ సమస్యలకు చెక్‌ పెడుతుంది..

చర్మ సమస్యలకు చెక్‌ పెడుతుంది..

వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి కాండిడా, మలాసేజియా, డెర్మాటోఫైట్స్ వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడంలో గొప్పగా పనిచేస్తాయి. మీరు చర్మ సమస్యలతో బాధపడుతుంటే.. వారానికి ఒకసారి మాత్రమే ప్రభావిత ప్రాంతంలో వెల్లుల్లి నూనె రాయాలి. ఇలా చేస్తే.. చర్మ సమస్యలు పరిష్కారం అవుతాయి.

జలుబు, దగ్గుకు చీప్‌ ట్రీట్మెంట్‌..

జలుబు, దగ్గుకు చీప్‌ ట్రీట్మెంట్‌..

వెల్లుల్లి నూనె జలుబు, దగ్గు, జ్వరం, వాటి లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో యాక్టివ్ ఎలిమెంట్ అల్లీన్ ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీరు స్నానం చేసే ముందు వెల్లుల్లి నూనెతో శరీరం మొత్తం మసాజ్‌ చేయండి. మీరు స్నానం చేసే నీటిలో వెల్లుల్లి నూనె వేసుకుని చేసినా మంచిదే.

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయని శిఖా అగర్వాల్‌ శర్మ అన్నారు. వెల్లుల్లి నూనె రక్తపోటును తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. మీ వంటలో వెల్లుల్లి నూనె వాడితే మేలు జరుగుతుంది.

పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది..

పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది..

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం దంతాల నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది. మీరు దంత సమస్యలతో బాధపడుతుంటే.. వెల్లుల్లి నూనెలో దూదిని ముంచి.. ప్రభావిత ప్రాంతంలో ఉంచండి, దీంతో పంటి నొప్పి తగ్గుతుంది.

ఎలా తయారు చేసుకోవాలి..?

ఎలా తయారు చేసుకోవాలి..?

మీరు ఇంట్లో వెల్లుల్లి నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వెల్లుల్లి రెబ్బలను దంచాలి. వీటిని ఆలివ్‌ ఆయిల్‌ వేసి వేయించండి. ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 5-8 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత మంట ఆఫ్‌ చేసి, చల్లారనివ్వండి. ఆ తర్వాత.. దీన్ని ఫిల్టర్‌ చేసి.. గాలి చొరబడని గాజు పాత్రలో నిల్వ చేసుకోండి.

వంటలో ఎలా వాడాలి..

వంటలో ఎలా వాడాలి..

మీరు రోజూవారి వంటలో ఈ నూనె వాడొచ్చు. మీరు బ్రోకలీ, కాలీఫ్లవర్, బఠానీలు అలాగే టోస్ట్ , గుడ్లపై ఉడికించిన కూరగాయలపై ఈ నూనెను స్ప్రింకిల్‌ చేయవచ్చు. మీరు సలాడ్స్‌ పైన కూడా ఈ నూనె వేసుకోవచ్చు. ప్రతిరోజూ 5 ml కంటే ఎక్కువ నూనె తినకూడదని గుర్తుంచుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news