Friday, March 24, 2023

ఏడిస్తే.. ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలా..?

Crying Benefits: చాలా మంది ఏడ్చేవాళ్లను చూసి బలహీనులుగా లెక్కవేస్తారు. ఏడుపు బలహీనతకు సంకేతమని అనుకుంటారు. మనలో కొంతమంది ఎవరైనా ఏడుస్తుంటే.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడని హేళన చేస్తూ ఉంటారు. కొంతమంది, పక్కవారు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక ఓదారుస్తూ ఉంటారు. వారి ఏడుపు ఆపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఏడవటమూ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లు పెడితే.. శరీరర, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అనేక ఉన్నాయని అంటున్నారు. తట్టుకోలేని బాధే కాదు.. హార్మోనుల్లో మార్పులు, ఒత్తడి, ఒంటరిగా అనిపించినా.. తట్టుకోలేక కంటి నుంచి నీళ్లు వస్తాయి. కన్నీళ్లు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

డిటాక్స్‌ చేస్తుంది..

డిటాక్స్‌ చేస్తుంది..

మూడు రకాల కన్నీళ్లు ఉంటాయి..

  • కంటిన్యూయస్‌ కన్నీళ్లు
  • రిఫ్లెక్స్ కన్నీళ్లు
  • భావోద్వేగ కన్నీళ్లు


కంటిన్యూయస్‌ కన్నీళ్లు, కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. రిఫ్లెక్స్ కన్నీళ్లు మీ కళ్ల నుంచి పొగ, ధూళి వంటి చెత్తను తొలగిస్తుంది. ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లకు పొరపాటున ఏదైనా తాకినప్పుడు, దుమ్మూధూళి పడ్డప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇవి కళ్లలో పడ్డ దుమ్ము బయటకు వచ్చేందుకు, కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక ఎమోషనల్‌ టియర్స్‌ (భావోద్వేగ కన్నీరు). ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ల నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. వీటి వల్ల మనిషికి ఒత్తిడి తగ్గుతుంది. భావోద్వేగ కన్నీళ్లలో ఒత్తిడి హార్మోన్లు, ఇతర విష పదార్థాలు ఉంటాయి. ఏడుపు మీ సిస్టమ్‌ నుంచి ఈ టాక్సిన్స్‌ను తొలగిస్తాయని పరిశోనలు స్పష్టం చేస్తున్నాయి. (image source – pixabay)

ఉపశమనం ఇస్తుంది…

ఉపశమనం ఇస్తుంది...

ఏడుపు స్వీయ-ఉపశమనానికి ఉత్తమ మార్గం. ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (PNS) సక్రియం చేస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. PNS మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది, మిమ్మల్ని శాంత పరుస్తుంది. (image source – pixabay)

కంటి చూపు మెరుగుపరుస్తుంది..

కంటి చూపు మెరుగుపరుస్తుంది..

మీరు కంటి రెప్పులు వేసిన ప్రతిసారీ.. బేసల్ కన్నీళ్లు విడుదలవుతాయి. అవి మీ కళ్లను తేమగా ఉంచడంలో, శ్లేష్మ పొరలు ఎండిపోకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ కళ్లను చక్కగా, లూబ్రికేట్‌గా ఉంచడం వల్ల కళ్లు పొడిబారవు. మీకు దృష్టి సమస్యలు రాకుండా ఉంటాయి.

(image source – pixabay)

మనస్సు తేలిక పడుతుంది..

మనస్సు తేలిక పడుతుంది..

తనివితీరా ఏడ్చాక మనసంతా తేలిక పడుతుంది. ఈ సమయంలో మెదడు ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లు వంటి మనసు తేలికపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. బాధ ఎక్కువగా ఉన్నప్పుడు.. ఆలోచనా తీరుపైనా ఎఫెక్ట్‌ పడుతుంది. మీ మనస్సులోని బాధ బయటకు వస్తే.. మీకు సానుకూల ఆలోచనలు వస్తాయి. (image source – pixabay)

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి తగ్గుతుంది..

కన్నీళ్లు మనిషి భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయని యేలె యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఏడిస్తే.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువసేపు ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్‌, ఎండోజెనస్‌ ఒపియడ్స్‌ విడుదలవుతాయి. ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలిగిస్తాయి.

ప్రశాంతంగా నిద్రపడుతుంది..

ప్రశాంతంగా నిద్రపడుతుంది..

ఓ సర్వే ప్రకారం ఏడ్చి పడుకున్న వారికి మంచి నిద్ర పట్టడంతోపాటు లేచినప్పుడు మానసిక ఉల్లాసం కలుగుతుందట. ఇదే కాదు, కన్నీటిలో ఐసోజిమ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. దీనికి యాంటిమైక్రోబయల్‌ లక్షణాలు ఉంటాయి. దీంతో కళ్లలోకి బ్యాక్టీరియా చేరితే ఐసోజిమ్‌ వాటితో పోరాడి కళ్లకు హాని కలగకుండా ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news