Sunday, April 2, 2023

ఈ రంగు ఫుడ్స్‌ తింటే.. 2 వారాల్లో షుగర్‌ కంట్రోల్‌లోకి వస్తుంది..!

Best Foods to Control Diabetes: వేగంగా విస్తరిస్తోన్న దీర్ఘకాలిక వ్యాధులలో డయాబెటిస్‌ ఒకటి. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు, దానిని సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ రక్తంలో చక్కెరను నియంత్రించే హార్మోన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 77 మిలియన్ల మంది ప్రజలు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. దాదాపు 25 మిలియన్ల మంది ప్రజలు ప్రీడయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు. మున్ముందు దీని బారినపడే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ, భారతీయ వైద్య పరిశోధన మండలి హెచ్చరిస్తున్నాయి.

ఇవి తింటే.. తగ్గుతుంది..

ఇవి తింటే.. తగ్గుతుంది..

మధుమేహాన్ని మందులతో, జీవనశైలి మార్పులతో, ఆహార అలవాట్లతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి మరో మార్గం లేదని మనకు తెలుసు. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ ప్రచురించిన ఒక తాజా అధ్యయనం ప్రకారం, ఊదా రంగు/వంకాయ రంగు (Purple Foods) ఆహార పదార్థాలు మన డైట్‌లో ఎక్కువగా తీసుకుంటే.. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని, షుగర్‌ బారిన పడే ముప్పు కూడా తగ్గించవచ్ని స్పషం చేసింది. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే.. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, నరాల దెబ్బతినడం, కంటి చూపు దెబ్బతినడం, దృష్టి సమ్యస్యలు, కిడ్నీలు వ్యాధులు, పాదాల సమస్యలు సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని గుర్తుంచుకోండి.

అధ్యయనం ఏమి చెప్పింది..

అధ్యయనం ఏమి చెప్పింది..

ఈ పరిశోధనలో, ఊదా రంగు/వంకాయ రంగు (Purple Foods) పండ్లు, కూరగాయలు డయాబెటిస్‌ రాకుండా రక్షిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇప్పటికే, షుగర్‌ వ్యాధితో బాధపడేవారు.. ఊదా రంగు/వంకాయ రంగు (Purple Foods) తరచుగా తీసుకుంటే.. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని, షుగర్‌ కారణంగా వచ్చే అనారోగ్యాల ముప్పు తగ్గుతుందని అన్నారు. షుగర్‌ పేషెంట్స్‌ హెల్తీ లైఫ్‌ లీడ్‌ చేయవచ్చని తెలిపారు.

ఊదా రంగు/వంకాయ రంగు పండ్లు, కూరగాయలు డయాబెటిస్‌ను ఎలా నివారిస్తాయి..?

ఊదా రంగు/వంకాయ రంగు పండ్లు, కూరగాయలు డయాబెటిస్‌ను ఎలా నివారిస్తాయి..?

ఊదా రంగు/వంకాయ రంగు (Purple Foods) పండ్లు, కూరగాయలలో పాలీఫెనాల్స్ సమృద్ధిగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలీఫెనాల్స్ ఆహారాలకు.. ఎరుపు, నారింజ, నీలం, ఊదా రంగు ఇస్తాయి. NCBI లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం, ఆంథోసైనిన్‌లు అధికంగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా బెర్రీలు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. (image source – pixabay)

Also Read: షుగర్‌ ఉంటే.. చేతులపై ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

ఆంథోసైనిన్ ఉంటుంది..

ఆంథోసైనిన్ ఉంటుంది..

ఎల్డర్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, బ్లాక్‌కరెంట్ వంటి ఊదా రంగు పండ్లలో నాన్‌సైలేటెడ్ ఆంథోసైనిన్‌లు ఉంటాయి. ఎసిలేటెడ్ ఆంథోసైనిన్‌లు ఎరుపు ముల్లంగి, ఊదా మొక్కజొన్న, బ్లాక్ క్యారెట్, ఎర్ర క్యాబేజీ, ఊదా రంగు బంగాళాదుంపలు, ద్రాక్షలోనూ మెండుగా ఉంటాయి. (image source – pixabay)

ఇన్సులిన్‌ పెంచుతాయి..

ఇన్సులిన్‌ పెంచుతాయి..

ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో, బ్లాక్ రైస్ నుంచి తీసుకున్న నాన్-ఎసిలేటెడ్ ఆంథోసైనిన్‌లు అక్కర్‌మాన్సియా ముసినిఫిలాతో సహా గట్‌లో కొన్ని మంచి బ్యాక్టీరియాను పెంచాయని పరిశోధకులు కనుగొన్నారు. ముసినిఫిలా టైప్ 2 డయాబెటిస్ ఉన్న ఎలుకలలో ఇన్సులిన్ స్రావాన్ని, గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచిందని పరోశోధకులు కనుగొన్నారు.

Also Read: డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే.. ఈ ఆహారం కచ్చితంగా తినాలి..!

హానికర బ్యాక్టీరియాను చంపుతాయి..

హానికర బ్యాక్టీరియాను చంపుతాయి..

ఊదారంగు చిలగడదుంపలు, ద్రాక్ష వంటి ఆహారాలలో లభించే ఎసిలేటెడ్ ఆంథోసైనిన్‌లు, పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచి చెడు బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తాయి. ఇవి పేగుల్లో ప్యాటీ యాసిడ్‌ ఉత్పత్తిని పెంచి, వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. (image source – pixabay)

Also read: షుగర్‌ పేషెంట్స్‌.. ఈ ఆకుల రసం తాగితే మంచిది..!

రెండు వారాల్లో బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది..

రెండు వారాల్లో బ్లడ్‌ షుగర్‌ తగ్గుతుంది..

అధ్యయనంలో, పరిశోధకులు రెండు వారాల పాటు డయాబెటిక్ ఎలుకలకు మల్బరీ జ్యూస్ ఇచ్చారు. మల్బరీలో నాన్సైలేటెడ్ ఆంథోసైనిన్ ఉంటుంది. రెండు వారాల తర్వాత ఎలుకల రక్తంలో చక్కెర స్థాయిలు దాదాపు 30% తగ్గాయని పరిశోధకులు కనుగొన్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news