
- శిర్షాసనం
- అధోముఖ వృక్షాసనం
- సర్వాంగాసనంలో
గుండెపై ఒత్తిడి పడుతుంది..
హైపర్‌టెన్షన్ ఉన్నవారికి.. రక్తాన్ని పంప్ చేయడానికి గుండ చాలా కష్టపడాల్సి ఉంటుంది. శిర్షాసనం, అధోముఖ వృక్షాసనం, సర్వాంగాసనం వేస్తే.. గుండెపై మరింత ఒత్తిడి పడుతుంది. శిర్షాసనం, అధోముఖ వృక్షాసనం, సర్వాంగాసనంలో గుండె కింద భాగంలో ఉంటుంది. దీని కారణంగా.. శరీరం మొత్తానికి రక్తం సరఫరా చేయడానికి మరింత కష్టపడుతుంది. ఈ ఒత్తిడి కారణంగా.. గుండెపోటు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది.
ఈ ఆసనాలు వేయవద్దు..
అధిక శ్రమ, ఊపిరి ఆడకపోవడానికి అవకాశం ఉన్న యోగాసనాలకు కూడా హైపర్‌టెన్షన్ పేషెంట్స్ వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆసనాల కారణంగా.. హైపర్‌టెన్షన్ మరింత పెరుగుతుంది.
యోగా బీపీని తగ్గిస్తుందా..?
హైబీపీ ఉన్న వ్యక్తులు యోగా చేయకూడదని కాదు. సరైన యోగాసనాలు ప్రాక్టిస్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి దూరం చేస్తుంది. మీరు శ్వాసను బాగా నియంత్రించగలుగుతారు, దీని కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఈ ఆసనాలు వేయండి..

- బాలాసనం
- సుఖాసనం
- శవాసనం
- భజంగాసనం
- సేతు బంధ సర్వాంగాసనం
ఈ జాగ్రత్తలు తీసుకోండి..

హైపర్‌టెన్షన్ పేషెంట్స్.. సోడియం ఉన్న ఆహారం తగ్గించి పొటాషియం ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును వయస్సు ఆధారంగా తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. పొటాషియం పుష్కలంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల,కాకర, స్ట్రాబెర్రీ, మునగ వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. రక్తపోటును తగ్గించడానికి వెల్లుల్లి బాగా సాయ పడుతుంది. రోజూ వారి వంటల్లో వెల్లుల్లి చేర్చుకోండి. వ్యాయామం చేయడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.