అయితే, ఈరోజు తారకరత్న పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్ద కర్మ కార్యక్రమంలోనూ అలేఖ్యారెడ్డిని కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు ఓదార్చారు. ఇదిలా ఉంటే, పెద్ద కర్మ సందర్భంగా భర్తను గుర్తుచేసుకుంటూ అలేఖ్యారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. వాలైంటన్స్ డే సందర్భంగా భర్త తారకరత్న తనకు రాసిన లేఖను ఈ పోస్ట్‌లో అలేఖ్యారెడ్డి పొందుపరిచారు. అంతేకాకుండా భర్త గురించి చాలా గొప్పగా రాసుకొచ్చారు. ఆ మాటలు, తారకరత్న లేఖలో పేర్కొన్న విషయాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.
‘మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం. జీవితంలో గడ్డుకాలాన్ని చవిచూశాం. అయినప్పటికీ నువ్వు, నేను కలిసి ఇంత దూరం ప్రయాణించాం. మంచి రోజుల కోసం ఎదురుచూశాం. మనకోసం ఒక చిన్న కుటుంబాన్ని సృష్టించుకున్నాం. అసలు నువ్వేంటో ఎవ్వరికీ తెలీదు. నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. నేను అర్థం చేసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. బాధలన్నింటినీ నీలోనే దాచేసుకుని మాకు మాత్రం గొప్పగా ప్రేమను పంచావు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పినా పట్టించుకోకుండా మరింత ఎత్తుకు ఎదుగుతా నాన్న. ఈరోజు నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా నాన్న’ అని అలేఖ్యా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఇక తారకరత్న రాసిన లేఖలోనూ ఆయన తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. ‘బంగారు తల్లి’ అంటూ ఎంతో ప్రేమగా పిలిచారు. తనకు ప్రేమను అస్సలు వ్యక్తపరచడం రాదంటూనే తన ప్రేమలోని నిజాయతీని చాటిచెప్పారు. ‘నాకున్నది నువ్వు మాత్రమే, నువ్వంటే నా ప్రపంచం బంగారం’ అంటూ భార్యకు వాలైంటన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు తారకరత్న. ఆ లేఖను ఇప్పుడు చదువుతున్న ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. అంత ప్రేమను పొందడం అలేఖ్యారెడ్డి అదృష్టమని.. అలాంటి భర్తను కోల్పోవడం ఆమె దురదృష్టమని కామెంట్లు పెడుతున్నారు. అలేఖ్యారెడ్డి ఆ దేవుడు మరింత శక్తిసామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుందాం.