Friday, March 24, 2023

Sri Reddy: బైరెడ్డికి శ్రీరెడ్డి బర్త్‌డే ట్రీట్.. ‘మరకమ్మా.. మరకమ్మా’ అంటూ చెమటలు పట్టించే వీడియో వదిలింది

వైఎస్సార్‌సీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddharth Reddy) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘విష్ యు హ్యపీ బర్త్‌డే బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి.. ఈ పాట నీకు డెడికేట్ చేస్తున్నాను’ అంటూ ‘రంగస్థలం’ సినిమాలోని సమంత ఆడిపాడిన ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు వయ్యారాలు వలికిస్తూ వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. మెసేజ్ మధ్యలో ఒక కేక్, మూడు హార్ట్ ఎమోజీలు కూడా జోడించింది.

‘రామచిలకమ్మ.. రేగిపండు కొడుతుంటే.. రేగుపండు గుజ్జు వచ్చి కొత్తగా చుట్టుకున్న రైక మీద పడుతుంటే.. రామచిలకమ్మ రేగిపండు కొడితే రేగుపండు గుజ్జు నా రైక మీద పడితే.. మరకమ్మా మరకమ్మ అంటే చూడడు మారు రైకయినా తెచ్చి ఇయ్యడు’ అనే లిరిక్‌కి తనదైన శైలిలో పెర్ఫార్మెన్స్ ఇస్తూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి డెడికేట్ చేసింది శ్రీరెడ్డి. మరి ఆమె ఈ రేంజ్‌లో విషెస్ చెప్తే కామెంట్లు ఏ స్థాయిలో వస్తాయో అర్థం చేసుకోవచ్చు.


వైసీపీలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌గా పేరుతెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని ఇప్పటికే శ్రీరెడ్డి చెప్పింది. ఆయన ఒప్పుకుంటే ఒక్కరోజు పెళ్లాంగా ఉండటానికి సిద్ధమంటూ ఓపెన్‌గా కామెంట్ చేసింది. వైసీపీలో ఉన్న పులుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరని.. ఆయనకు, తనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కూడా ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ‘బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చాలా అందంగా ఉంటాడు. నాలానే చాలా ఓపెన్‌గా మాట్లాడతాడు. అలాగే నాకు సామాజిక సేవ ఎలా ఇష్టమో ఆ అబ్బాయి కూడా అలానే ఇష్టం. కాకపోతే నేను బోల్డ్.. అతను సాఫ్ట్. మొత్తంగా మా ఇద్దరి ఉద్దేశం సమాజ సేవ’ అంటూ అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.

‘వాళ్ల ప్రాంత అభివృద్ధి కోసం అతను చేసే కార్యక్రమాలు అవ్వచ్చు.. అతను మాట్లాడే తీరు అవ్వచ్చు.. అతను చూసే చూపు అవ్వచ్చు.. నాకు మగాడిలా అనిపించాడు’ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. తాను సిద్ధా్ర్థ్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని.. కనబడితే మాత్రం వదలను అంటూ ఇప్పటికే చాలా సార్లు శ్రీరెడ్డి వెల్లడించింది. ఒక్కరోజు భార్యగా ఉంటానని.. ఆయనకు వండి పెట్టి సపర్యలు చేస్తానని.. ఆ తరవాత ఏం ఉంటుందో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చాలా బోల్డ్‌గా మూడేళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడింది. మొత్తంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే తనకు క్రస్ అని చాలా సందర్భాల్లో వెల్లడించింది. ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్పి టాపిక్‌ను జనాలు మరిచిపోకుండా చేస్తోంది.

Latest news
Related news