ఇక SBI Sarvottam రిటైల్, బల్క్ డిపాజిట్ల కాలవ్యవధి సంవత్సరం, రెండు సంవత్సరాలుగా మాత్రమే ఉంది. ఇక ఎస్‌బీఐ సర్వోత్తమ్ డిపాజిట్లను రెనివల్ చేసుకునేందుకు సదుపాయం లేదు. మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం కస్టమర్ అకౌంట్లోకి బదిలీ అవుతుంది.
ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే రెండేళ్ల వ్యవధితో రూ.15 లక్షలకుపైన డిపాజిట్ చేస్తే గనుక ఇది సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 7.40 శాతంగా, సీనియర్ సిటిజెన్లకు 7.90 శాతంగా ఉంది. ఇది ఇతర చాలా ప్రభుత్వ పథకాలతో పోల్చితే చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఏడాది టెన్యూర్‌తో ఎస్‌బీఐ సర్వోత్తమ్ డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.55 శాతం వడ్డీ రేటు అమలు చేస్తోంది.
ఇక ఇదే SBI ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ విషయానికి వస్తే 3 నుంచి 7 శాతం వరకు మాత్రమే వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇది 7 రోజుల నుంచి పదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తుంది. సీనియర్ సిటిజెన్లకు మాత్రం 3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ అందుతోంది. 2023, ఫిబ్రవరి 15 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. ఇక రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు డిపాజిట్లపై ఏడాది కాలవ్యవధికి 7.05 శాతం సాధారణ ప్రజలకు, 7.55 శాతం సీనియర్ సిటిజెన్లకు అందుతోంది. ఇక రెండేళ్ల వ్యవధి విషయానికి వస్తే ఇది సాధారణ పౌరులకు 6.90 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.40 శాతంగా ఉంది.
- Read Latest Business News and Telugu News