సమయామికి చేతిలో డబ్బులు లేని వారు ఈ ఆర్ఎన్‌పీఎల్ (RNPL) సేవల ద్వారా అద్దె చెల్లించి సమస్య నుంచి బయటపడొచ్చు. ప్రస్తుతానికి ఎలాంటి కన్వీనియన్స్ ఫీజులు విధించడం లేదు. దాంతో పాటు 40 రోజుల వరకు ఈ నగదును ఎలాంటి వడ్డీ లేకుండా తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంది. అంతేకాదు.. మనం తీసుకున్న నగదు మొత్తాన్ని నెలవారీ వాయిదాలు ఈఎంఐలుగా మార్చుకోవచ్చు కూడా. క్రెడిట్ కార్డు లేని వారికి లక్షలాది మంది కస్టమర్లకు ఆర్‌ఎన్‍పీఎల్ ప్రయోజనకరంగా ఉంటుందని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ పేర్కొన్నారు. అధికారింగా ఈ సేవల్ని ప్రారంభించడానికి మునుపే ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలిపారు. ఈ సేవలను లక్ష మంది యూజర్లు వినియోగించుకొని సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే (Google Pay) వంటి ఆర్థిక సేవల సంస్థలు రెంట్ పే ఆప్షన్‌ను అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డును ఉపయోగించి వీటి ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే, అందుకు గానూ కొంత ఛార్జీలను అవి వసూలు చేస్తున్నాయి. బ్యాంకులు సైతం ఒక శాతం వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే, హౌసింగ్.కామ్ ఆర్‌ఎన్‌పీఎల్ సేవలు ఉపయోగించుకోవడానికి ఎలాంటి క్రెడిట్ కార్డు సైతం అవసరం ఉండదు. 40 రోజుల వరకు ఛార్జీలు ఉండవు.
లక్ష మందికి సేవలు..
హౌసింగ్.కామ్, నీరో ఇప్పటికీ ఈ సేవలను దాదాపు 1,00,000 మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సర్వీ ప్రీ-లాంచ్ దశ పూర్తయింది. మొదటి సారి చేసే రెంట్ పేమెంట్స్‌కు జీరో కన్వీనియన్స్ లేదా సర్వీసు ఫీజు వసూలు చేయడం లేదు. గతంలో హౌసింగ్.కామ్ తమ కస్టమర్లకు క్రెడిట్ కార్డు సేవలను అందించేది.
- Read Latest Business News and Telugu News