మంచు మనోజ్ (Manchu Manoj), మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనికారెడ్డి మెడలో మంచు మనోజ్ మూడు ముళ్లు వేశారు. ఈ వివాహ వేడుకకు మనోజ్ అన్నయ్య మంచు విష్ణు కూడా హాజరయ్యారు. భార్య విరానికా, పిల్లలతో కలిసి విష్ణు కారులో పెళ్లి వేదిక వద్దకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.