Sunday, April 2, 2023

Manchu Manoj: మౌనిక ఫ‌స్ట్ మ్యారేజ్‌కి అతిథిగా వెళ్లిన మంచు మ‌నోజ్‌.. ఫొటోలు వైర‌ల్

Manchu Manoj – Naga Mounika: మంచు ఫ్యామిలీ హీరో మంచు మ‌నోజ్‌.. దివంగ‌త రాజకీయ నాయ‌కుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా నాగ మౌనిక వివాహం శుక్ర‌వారం రాత్రి 8.30ల‌కు జరగనుందనే వార్త‌లు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాల‌కు చెందిన వారు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. కొన్నాళ్ల పాటు వీరిద్ద‌రూ క‌లిసి రిలేష‌న్ షిప్ చేసిన త‌ర్వాత పెళ్లి వైపు అడుగు లేశారు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే.

అయితే మౌనిక మొద‌టి పెళ్లికి మంచు మ‌నోజ్ అతిథిగా వెళ్లార‌ని, ఇప్పుడామెనే ఆయ‌న రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. 2015లో మౌనిక‌కు పెళ్లైంది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరి పెళ్లికి మంచు మోహ‌న్ బాబు ఒప్పుకోలేద‌ని, అందుక‌నే మ‌నోజ్‌, మౌనిక‌లు చాలా రోజుల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నార‌నేది కూడా ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లుగా వినిపిస్తున్నాయి. ఫిల్మ్ న‌గ‌ర్‌లోని మంచు ల‌క్ష్మి ఇంట్లోనే మ‌నోజ్‌, మౌనిక‌ల పెళ్లి జ‌రిగింద‌నేది బ‌య‌ట వినిపిస్తోన్న స‌మాచారం.

చాలా రోజుల పాటు సినీ ఇండ‌స్ట్రీకి, కుటుంబానికి మ‌నోజ్ దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్ర‌మే ఇంటికి వ‌చ్చి వెళుతుండేవారు. ఈ మ‌ధ్య‌లో వాట్ ది షిట్ అనే సినిమాను కూడా చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. సినిమా గురించి చెప్పారు కానీ.. వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఆయ‌న ఏమీ చెప్ప‌లేదు. అయితే సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్నారు.

ALSO READ: Jr Ntr: తార‌క‌ర‌త్న పెద్ద‌క‌ర్మ‌లో ఎన్టీఆర్‌ను ప‌ట్టించుకోని బాల‌య్య‌.. వీడియో వైర‌ల్‌.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌

ALSO READ: Allu Arjun: ఫ్యాన్స్‌కి పండ‌గే..అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో అల్లు అర్జున్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
ALSO READ: ముగ్గురు హీరోయిన్స్‌తో వెంకీ మామ

Latest news
Related news