Friday, March 24, 2023

Kangana Ranaut: శృంగారానికి బద్దకం.. పెళ్లంటే భయం.. కంగనా రనౌత్ కామెంట్స్

విషయం ఏదైనా బోల్డ్ స్టే్ట్‌మెంట్స్ ఇవ్వడంలో బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తర్వాతే ఎవరైనా. ఒకవేళ తన కామెంట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేసినా.. ఎదురయ్యే పరిణామాలను తను ధైర్యంగా ఎదుర్కోగలదు. బాలీవుడ్‌ నెపో మాఫియాను విమర్శించినా, హృతిక్ రోషన్‌తో రిలేషన్‌షిప్‌ను బయటపెట్టినా.. ఆమె వ్యవహారమంతా ఓపెన్‌గానే ఉంటుంది. ఇక కొంతకాలంగా బాలీవుడ్‌తో పాటు దేశంలోని అనేక సోషియో పొలిటికల్ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటున్న కంగన.. లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో Gen Z (1997 నుంచి 2012 మధ్య పుట్టినవారు) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఈ జనరేషన్ మొత్తం ఫోన్లకే బానిసలు అయ్యారని, ఇల్లు కొనేందుకైనా స్థోమత లేదని, కమిట్‌‌మెంట్‌తో పాటు పెళ్లి చేసుకోవడానికి కూడా జంకుతున్నారని చెప్పింది. అంతేకాదు శృంగారం విషయంలోనూ సోమరితనాన్ని ప్రదర్శిస్తు్న్నారంటూ క్యారెట్, ముల్లంగితో పోల్చింది.

ఆమె పోస్టు విషయానికొస్తే.. ‘Gen Z… HA HA వారి చేతులు, కాళ్లు కర్రల మాదిరిగా ఉంటాయి. ఒకరితో ఇంటరాక్ట్ కావడం, గమనించడం లేదా చదవడం కంటే కూడా ఎక్కువ సమయం ఫోన్‌లలోనే గడుపుతారు. వారి మనసులు స్థిరంగా ఉండలేవు. ఆఫీస్‌లో బాస్‌ను గౌరవించరు కానీ ఆ పొజిషన్ తమకు కావాలనుకుంటారు. క్రమశిక్షణ, హార్డ్ వర్క్‌తో ఎదిగిన వారంటే ఇష్టముండదు. షార్ట్ కట్స్‌లో సక్సెస్ పొందిన వారినే గౌరవిస్తారు’ అని పేర్కొంది.

ఈ జనరేషన్‌ స్టార్‌బక్స్, అవోకాడో టోస్ట్‌లను ఇష్టపడతారు కానీ వారికి ఇల్లు కొనే స్థోమత ఉండదన్న కంగన.. అట్రాక్ట్ చేసేందుకు బ్రాండెడ్ దుస్తులు రెంట్‌కు తీసుకుంటారు కానీ కమిట్‌మెంట్ లేదా పెళ్లిని ద్వేషిస్తారని విమర్శించింది. సెక్స్ విషయంలోనూ వారు సోమరులని అధ్యయనాలు చెప్తున్నాయని.. రోలింగ్ ఐస్, సిల్లీ స్లాంగ్‌ కలిగిన GenZ పీపుల్‌ బ్రెయిన్ వాష్‌ను ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చని చెప్పింది. వీళ్లకంటే మిలీనియల్స్ బెటర్ అని వెల్లడించింది.

సినిమాల విషయానికొస్తే.. కంగన ‘చంద్రముఖి 2’ చిత్రంలో నటిస్తోంది. పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గతంలో రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్. ఇందులో కంగన నర్తకి పాత్రలో కనిపించనుంది. కాగా.. రాఘవ లారెన్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగన టైటిల్ రోల్ చేస్తోంది.

Latest news
Related news