”చాట్‌జీపీటీ కోడర్‌పై ప్రభావం చూపే అవకాశాలు లేవు. మానవుని మనసు, మెదడు చాలా అనువుగా ఉంటుంది. ఇది దేన్నయినా ఇట్టే అర్థం చేసుకోగలదు.” అన్న నారాయణ మూర్తి.. దీనిని ఇతర ప్రయోజనాల కోసం మరింత మెరుగ్గా వినియోగించే ఆలోచనా సామర్థ్యం మానవులకు ఉందని అన్నారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరమ్ 2023లో మాట్లాడిన నారాయణ మూర్తి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కూడా భారత ఐటీ కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు లేవని, గతంలో కూడా ఎన్నో సందర్భాల్లోనో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడిందని గుర్తుచేసుకున్నారు.
ఇక ఇదే సమయంలో ఐటీ కంపెనీలు.. ఫ్రెషర్ల నియామకాలపై ఆన్‌బోర్డింగ్ విషయాల్లో జాప్యం చేస్తున్న దానిపై నారాయణ మూర్తిని ప్రశ్నించగా.. సరైన రుజువులు లేకుండా, ఎలాంటి డేటా లేకుండా ఇలా అడగడం కరెక్ట్ కాదని అన్నారు. ఇన్ఫోసిస్ అలా ఎప్పటికీ చేయదని, చేయట్లేదని అన్నారు. మరోవైపు.. ఇటీవల మూన్‌లైటింగ్, వర్క్ ఫ్రమ్ హోం కల్చర్‌పైనా నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని తాను అస్సలు సహించనని, వర్క్ ఫ్రం హోం కూడా ఉద్యోగుల మధ్య సమన్వయాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
ఇక ఇటీవల టీసీఎస్ కూడా చాట్‌జీపీటీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది ఒక కోవర్కర్‌గా మాత్రమే పనిచేయగలదని, ఉద్యోగాలపై ఏ ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. ఇక చాట్‌జీపీటీని శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న ఏఐ రీసెర్చ్ కంపెనీ OpenAI రూపొందించింది. దీని వెనుక మైక్రోసాఫ్ట్ బింగ్ కూడా ఉంది. అయితే చాట్‌జీపీటీ అనేది అత్యంత కచ్చితత్వంతో ఫలితాన్ని ఇస్తుందని నిర్ధరణ ఏం లేదు. దీనిపై ఫ్యాక్ట్ చెకింగ్ ఏం లేదు. మనుషుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది.
- Read Latest Business News and Telugu News