గన్నవరం కేసులో అరెస్ట్…
కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరగగా… ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే దాడికి పాల్పడ్డారని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దాడిని నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో గన్నవరం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సమయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.