Thursday, March 30, 2023

బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు

ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఓ కారణం. మెదడులోని కణాలు నియంత్రించలేని విధంగా పెరిగినప్పుడే ఇది వస్తుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరోలాజికల్ సర్జన్స్ ప్రకారం, 150 కి పైగా వివిధ మెదడు కణితులు ఉన్నాయి. వీటిని రెండు ప్రధాన సమూహాలుగా విభజించారు. ప్రాథమిక, మెటాస్టాటిక్ మెదడు కణితులు. వీటి గురించి పూర్తి వివరాలు ఏంటి. బ్రెయిన్ ట్యూమర్ మరిన్ని వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

బ్రెయిన్ ట్యూమర్స్ రకాలు..

బ్రెయిన్ ట్యూమర్స్ రకాలు..

మాయో క్లినిక్ ప్రకారం కొన్ని మెదడు కణితులు ప్రమాదరకమైనవి కాదు. మరికొన్ని మాత్రం మరీ ప్రాణాంతకమైనవి. మెదడులోనే మొదలై పెరిగే కణితులను ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. శరీరంలోని ఇతర భాగాల నుండి మెదడుకి వ్యాపించే కణితులు భిన్నంగా ఉంటాయి. వీటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటారు.
Also Read : Kidney Problems : ఎండాకాలంలో ఈ లక్షణాలు ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లే..

పరిమాణం విషయంలో..

పరిమాణం విషయంలో..

మెదడు కణితులు చిన్న పరిమాణం నుండి పెద్ద పరిమాణంలో ఉంటాయి. కొన్ని మెదడు కణితులు చిన్నవిగా ఉన్నప్పుడు కనిపిస్తాయి. వీటిని వెంటనే గమనించొచ్చు. ఇతర కణాలను గమనించకముందే పెరుగుతాయి. మొదడు కణుతులు తక్కువగా చురుగ్గా ఉంటే వెంటనే లక్షణాలను చూపించకపోవచ్చు. లక్షణాలను గమనించక ముందే కణితి పరిమాణం పెద్దదిగా మారొచ్చు.

లక్షణాలని చూస్తే..

లక్షణాలని చూస్తే..

కణితి స్థానాన్ని బట్టి మెదడు కణితి లక్షణాలు భిన్నంగా ఉంటాయని యూకె నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెబుతోంది. కొన్ని లక్షణాలను చూస్తే..

తలనొప్పి
మూర్చ
అనారోగ్యం
వికారం
వాంతులు
నీరసం
మానసిక సమస్యలు
జ్ఞాపకశక్తి తగ్గడం
పక్షవాతం
చూపు, వినికిడి సమస్యలు

నరాల సమస్యలు..

నరాల సమస్యలు..

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు.. నరాల సమస్యల్ని ఎదుర్కొంటారు. మెదడు కణితి అనేది వారికి ప్రాణాంతకం అని చెప్పొచ్చు. బద్ధకంగా ఉండడం, గందరగోళం, కళ్ళు తిరగడం అనేవి లక్షణాలు. ఇవి ఉండి ఉండి మనిషి కోమాలోకి వెళ్తాడని నిపుణులు చెబుతున్నారు.

ఏ వయసులో వస్తుందంటే..

ఏ వయసులో వస్తుందంటే..

150 కంటే ఎక్కువ రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. అయినప్పటికీ, గ్లియోబ్లాస్టోమా అనేది పెద్దవారిలో అత్యంత తీవ్రమైన క్యాన్సర్. గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు, వెన్నుపాములోని కణాల పెరుగుదలగా వచ్చే క్యాన్సర్ అని మాయో క్లినిక్ చెబుతుంది. ఇది త్వరగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసి నాశనం చేయగలదు. నరాల కణాలకు సపోర్ట్‌ని ఇచ్చే ఆస్ట్రోసైట్స్ అనే కణాల నుండి గ్లియోబ్లాస్టోమా ఏర్పడుతుంది. ఇది ఏ వయసులోనైనా వస్తుందని హల్త్ బాడీ చెబుతోంది.
Also Read : Diabetes and cancer : షుగర్ ఉన్నవారికి ఈ క్యాన్సర్ వస్తుందట.. జాగ్రత్త..

డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి..

డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి..

మీరు మెదడులో కణితిని అనుమానిస్తే, ఏదైనా నాడీ సంబంధిత మార్పులను గమనిస్తే ముందుగా డాక్టర్‌తో పరీక్షించుకోవాలి. న్యూరోలాజికల్ టెస్ట్, హెడ్ సిటి స్కాన్, మెదడు ఎమ్‌ఆర్ఐ, మెదడు పీఈటీ స్కాన్, బయాప్సీ వంటివి బ్రెయిన్ ట్యూమర్‌ని గుర్తించే మార్గాలు. మెదడు కణుతులు, క్యాన్సర్ వ్యాప్తి చెందే అవకాశం లేనందున, ఇతర క్యాన్సర్ల మాదిరిగా వాటికి స్టేజెస్ లేవు. దీనికి వెంటనే ట్రీట్‌మెంట్ అవసరం.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

Latest news
Related news