‘నిస్పక్షపాతంగా జరగాలి..’
“ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలి. మా ఆదేశాలతో ఎన్నికల్లో స్వచ్ఛత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము,” అని జస్టిస్ కేఎం జోసేఫ్తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో స్వచ్ఛతను పరిరక్షించడం చాలా అవసరం అని, లేకపోతే తీవ్ర ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.