రూ.40లక్షలు తీసుకుంటూ..
Karnataka BJP MLA Son Caught taking Bribe: బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్.. బెంగళూరు వాటర్ సప్లయ్, సీవేజ్ బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్‍గా విధులు నిర్వరిస్తున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40లక్షల లంచం తీసుకుంటూ ఆఫీస్‍లో గురువారం పట్టుబడ్డారు ప్రశాంత్. లోకాయుక్త అధికారులు ప్రశాంత్‍ను పట్టుకొని, ఆఫీస్‍లోనూ సోదాలు జరిపారు. ఆఫీస్‍లో మూడు బ్యాగ్‍లను స్వాధీనం చేసుకున్నారు. “బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‍ను రూ.40లక్షల లంచం తీసుకుంటుండగా.. లోకాయుక్త అవినీతి నిరోధక విభాగం నిన్న పట్టుకుంది. ఆయన ఆఫీస్ నుంచి రూ.1.75కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది” అని కర్ణాటక లోకాయుక్త వెల్లడించింది.