Sonia Gandhi admitted to hospital: జ్వరం రావడంతో..
జ్వరం రావడంతో సోనియాగాంధీని గురువారం ఆమె రెగ్యులర్ గా చికిత్స పొందే గంగారామ్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. సోనియాగాంధీ (Sonia Gandhi) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ బులెటిన్ లో వెల్లడించారు. గంగారామ్ ఆసుపత్రిలోని ఛాతి వ్యాధుల విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆరుప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం సోనియా గాంధీకిి చికిత్స అందిస్తున్నారని సర్ గంగారామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ చైర్మన్ డీఎస్ రాణా వెల్లడించారు.