మ్యచ్‌లో ఇన్నింగ్స్ 30వ ఓవర్ వేసిన స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాదిన ఉమేశ్ యాదవ్ .. ఆ తర్వాత ఓవర్‌లో మర్ఫీ బౌలింగ్‌లో బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా మరో సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్‌ని డ్రెస్సింగ్ రూము నుంచి చూసిన విరాట్ కోహ్లీ భలే ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. అలానే ఒక బౌండరీ కూడా ఉమేశ్ యాదవ్ కొట్టాడు.
ఇప్పటికే ముగిసిన తొలి రెండు టెస్టుల్లో.. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఉమేశ్ యాదవ్.. ఈ మ్యాచ్‌తో మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి ఉమేశ్ యాదవ్‌కి చోటిచ్చినట్లు టాస్ టైమ్‌లో రోహిత్ శర్మ వెల్లడించాడు. గత వారం ఉమేశ్ యాదవ్ తండ్రి అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. దాంతో తండ్రి అంత్యక్రియలకి హాజరైన ఉమేశ్.. రోజుల వ్యవధిలోనే మళ్లీ జట్టుతో చేరాడు.
ఇండోర్ టెస్టు ఉమేశ్ యాదవ్‌కి కెరీర్‌లో 55వ టెస్టు మ్యాచ్‌కాగా.. ఈరోజు కొట్టిన రెండు సిక్సర్లతో కలిపి టెస్టుల్లో అతని సిక్సర్ల సంఖ్య 24కి చేరింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డ్‌ని కూడా ఉమేశ్ యాదవ్ సమం చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 107 టెస్టులాడి 24 సిక్సర్లు కొట్టాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే ఉమేశ్ యాదవ్.. బంతిని బలంగా హిట్ చేస్తూ ఆఖర్లో విలువైన పరుగుల్ని టీమ్‌కి అందిస్తుంటాడు.
Read Latest Sports News, Cricket News, Telugu News