Tuesday, March 21, 2023

rhino finance, Loan Appsతో కలిసి అక్రమాలు.. తోక కత్తెరించిన RBI.. ఈ Finance కంపెనీ బాధితుల్లో మీరూ ఉన్నారా? – rbi reserve bank cancels registration of rhino finance due to irregular lending practices


RBI: సాధారణంగా వ్యక్తిగత, హోమ్ లోన్ వంటివి బ్యాంకుల నుంచి తీసుకుంటారు. కొన్ని అనివార్య సందర్భాల్లో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయించాల్సి వస్తుంది. అలాంటి వాటి చేతిలో ఒక్కసారి చిక్కుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రుణాలపై అధిక వడ్డీ వసూలు చేయడం, లోన్ రికవరీ విషయంలో కస్టమర్లను వేధించడం వంటి సంఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి చర్యలకే పాల్పడిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. గువాహటి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న రైనో ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (Rhino Finance Private Ltd) రుణాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించింది. ఈ మేరకు రైనో ఫైనాన్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైనో పైనాన్స్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీఓఆర్) రద్దు చేసినట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India). థర్డ్ పార్టీ లోన్ యాప్‌ల (Loan Apps) ద్వారా డిజిటల్ లెండింగ్ ఆపరేషన్స్‌లో ఉల్లంఘటనలతో పాటు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను సైతం ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ ఆర్‌బీఐ మార్గదర్శాకలను ఉల్లంఘించి అధికంగా వడ్డీలు వసూలు చేయడం సహా లోన్ రికవరీ విషయంలో కస్టమర్లను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలింది. ‘ అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

రైనో ఫైనాన్స్ కంపెనీతో భాగస్వామ్యమైన సర్వీస్ ప్రొవైడర్లు లేదా మొబైల్ యాప్స్‌లో హలో లోన్, క్రెడిట్ హబ్, కోకో క్యాష్, ఫ్లాష్ లోన్, బ్రిడ్జ్ లోన్, క్రేజీ బీ, రుపీ బస్ వంటివి ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది. సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీఓఆర్) క్యాన్సల్ చేసిన క్రమంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్ బిజినెస్ నిర్వహించకూడదని రైనో ఫైనాన్స్‌కు సూచించింది రిజర్వ్ బ్యాంక్.

కోఆపరేటివ్ బ్యాంకులపై ఆంక్షలు..
ఇటీవలే 5 కోఆపరేటివ్ బ్యాంకుల ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రోజు వారీ లావాదేవీలకు సైతం సరైన నగదు నిల్వలు లేకుండా మారిన క్రమంలో దివాలా అంచుకు చేరుకుందని గ్రహించి ఈ మేరకు చర్యలు తీసుకుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు విధించింది. అందులో మూడింటిపై పాక్షిక రెండింటిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు పెట్టింది. ఈ క్రమంలో డిపాజిటర్ల భద్రత కోసం అర్హులైన వారికి డిపాజిటర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా బీమా కల్పిస్తామని పేర్కొంది.

దివాలా అంచున 5 బ్యాంకులు.. ట్రాన్సాక్షన్లపై RBI ఆంక్షలు.. లబోదిబోమంటున్న డిపాజిటర్లు!EMI మరింత భారం.. Home Loan వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ బ్యాంక్.. రేపటి నుంచే అమలు!కొత్త నెల తొలి రోజే ICICI Bank ఝలక్.. వడ్డీ రేట్లు పెంపు.. ఇక EMI ఎక్కువ కట్టాల్సిందే!



Source link

Latest news
Related news