Sunday, April 2, 2023

Pushpa 2: RRR కంటే పుష్ప 2నే గ్రేట్ అంటున్న బాలీవుడ్ క్రిటిక్

Pushpa 2: బాహుబ‌లి, RRR వంటి సినిమాలను క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. గ‌త ఏడాది విడుద‌లైన ఆర్ఆర్ఆర్ మూవీ దాదాపు రూ.1200 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ఇప్పుడు ఆస్కార్‌కి అడుగు దూరంలో ఉంది. ఈ నేప‌థ్యంలో RRR కంటే పుష్ప 2 సినిమానే గ్రేట్ అని అంటున్నాడు బాలీవుడ్ క్రిటిక్‌, అన‌లిస్ట్ క‌మ‌ల్ ఆర్‌.ఖాన్‌. ఇలాంటి స్టేట్‌మెంట్ చేయాలంటే కాస్తో కూస్తో ఆలోచిస్తారు ఇంకేవ‌రైనా. అయితే క‌మ‌ల్ ఆర్‌.ఖాన్ మాత్రం ఈ విష‌యంలో నో సెకండ్ థాట్ అని అనేస్తున్నాడు. అందుకు ఆయ‌న లెక్క‌లు కూడా చెప్పేస్తున్నాడు.

RRR సినిమా అన్నీ రైట్స్ క‌లుపుకుని రూ.750 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జ‌రుపుకుంది. కానీ.. పుష్ప 2 సినిమా అన్నీ రైట్స్ క‌లుపుకుని రూ.1050 కోట్ల బిజినెస్ జ‌రుగుతుంది. అంటే దాదాపు రూ.400 కోట్ల ఎక్కువ బిజినెస్ జ‌రిగింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే పుష్ప 2 సినిమా RRR కంటే గ్రేట్ అని అంటున్నారు. దీనిపై నెటిజ‌న్స్ కొంద‌రు అవున‌ని, కాద‌ని అంటూ రియాక్ట్ అవుతున్నారు.

ప్ర‌స్తుతం RRR టీమ్‌లో చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి, కీర‌వాణి స‌హా మెయిన్ టీమ్ యు.ఎస్‌లో సంద‌డి చేస్తుంది. త్వ‌ర‌లోనే వీరితో పాటు ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. ఈ పాట‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకుంటున్నారు. మ‌రో వైపు పుష్ప 2 మూవీ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. సుకుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ ఇందులో విల‌న్‌గా న‌టించారు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌, మాఫియా బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా ఇది.

ALSO READ: Salaar: బుక్ మై షోలో ‘సలార్’ సెన్సేషనల్ రికార్డ్.. క్రేజ్ మామూలుగా లేదే
ALSO READ:
ALSO READ:SSMB 28: కండ‌ల తిరిగిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌.. ఫొటో వైర‌ల్‌

ALSO READ: Naatu Naatu: ‘నాటు నాటు’ సాంగ్‌పై సద్గురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ALSO READ: Shah Rukh Khan: బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ ఔట్.. రామ్ చరణ్ ఇన్..!

Latest news
Related news