Friday, March 24, 2023

Pujara Six | పుజారాకి ఇషాన్ ద్వారా మెసేజ్ పంపిన రోహిత్ శర్మ.. భారీ సిక్స్‌తో రిప్లై!

ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara), అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీరుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండగా.. రెండో రోజైన గురువారం భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో చతేశ్వర్ పుజారా 142 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 59 పరుగులు చేయగా.. అక్షర్ పటేల్ 39 బంతుల్లో 1×6 సాయంతో అజేయంగా 15 పరుగులు చేశాడు. కానీ.. ఈరోజు లాస్ట్ సెషన్‌లో ఇద్దరూ అతిగా బంతిని డిఫెన్స్ చేస్తూ కనిపించడం రోహిత్‌కి కోపం తెప్పించింది.

భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 140/7తో నిలిచిన దశలో పుజారా, అక్షర్ పటేల్ క్రీజులో నిలిచారు. కానీ.. ఈ ఇద్దరూ గేర్ మార్చకుండా కేవలం డిఫెన్స్‌నే ఆశ్రయించడంతో టీమిండియా డగౌట్ నుంచి వాటర్ బాయ్ ఇషాన్ కిషన్ ద్వారా రోహిత్ శర్మ మెసేజ్ పంపించాడు. ఎంతసేపు వీళ్లు డిఫెన్స్ ఆడుతూ ఉంటారు.. లాంగ్‌లో ఫీల్డర్లు లేరు హిట్ చేయమని చెప్పు అనేలా సైగలు చేస్తూ ఇషాన్ కిషన్‌కి రోహిత్ శర్మ చెప్పడం వీడియోలో కనిపిస్తోంది.
ఓవర్ ముగిసిన తర్వాత మైదానంలోకి వాటర్ బాటిల్స్‌తో వెళ్లిన ఇషాన్ కిషన్ తొలుత పుజారాకి రోహిత్ శర్మ చెప్పిన మాటల్ని చెప్తూ కనిపించాడు. అనంతరం పుజారా ఆ మాటల్ని అక్షర్ పటేల్‌కి చెప్తున్నట్లు కనిపించింది. ఈ డిస్కషన్ జరిగిన ఓవర్ వ్యవధిలోనే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో మిడ్‌ వికెట్ దిశగా పుజారా భారీ సిక్స్ కొట్టాడు. దాంతో రోహిత్ శర్మ ‘పిడికిలి బిగించి ఇలా ఆడాలి’ అనేలా రియాక్షన్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కాసేపటికే పుజారా ఔటైపోగా.. అక్షర్ పటేల్‌ కూడా లయన్ బౌలింగ్‌లో ఓ సిక్స్ కొట్టాడు. ఆస్ట్రేలియా ముందు కేవలం 76 పరుగుల టార్గెట్‌ని భారత్ నిలపగలిగింది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news