ఈ నేపథ్యంలో ప్రపంచంలో యావత్తు ‘నాటు నాటు’ ఫీవర్ పట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాట హుక్ స్టెప్‌కి కాలు కదుపుతున్నారు. రీసెంట్‌గా కొరియన్ రాయబారి తన టీమ్‌తో చేసిన నాటు నాటు పాటకు డాన్స్‌కి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ప్రధాన మోదీ సైతం ఆ వీడియోను రీ ట్వీట్ చేసి RRR టీమ్‌ను అప్రిషియేట్ చేశారంటే దాని ఎఫెక్ట్ ఏ రేంజ్‌కు చేరుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు నాటు నాటు పాటపై తన సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘‘నాటు నాటు’ పాటకు ప్రపంచం యావత్తు డాన్స్ చేస్తుంది. RRR టీమ్‌కు అభినందనలు. కొరియన్ రాయబారి తన టీమ్‌తో నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. వారికి కూడా అభినందనలు’ అని తెలియజేస్తూ కొరియన్ ఎంబసీ ఇండియా వాళ్లు పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేవారు సద్గురు.
ఇప్పటికే హాలీవుడ్ సినిమాలతో పాటు ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్‌ను లైవ్ ఫెర్ఫామెన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది నిజంగా తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పొచ్చు.
- Read latest Tollywood updates and Telugu