గాయం కారణంగా తొలి రెండు టెస్టులకి దూరంగా ఉండిపోయిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్.. 100 శాతం ఫిట్‌గా లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇండోర్ టెస్టులో ఆడుతున్నాడు. ఆ జట్టు పాస్ట్ బౌలర్ కమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. అలానే ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా గాయంతో సిరీస్‌కి దూరమై ఆస్ట్రేలియాకి తిరిగి వెళ్లిపోయాడు. దాంతో మిచెల్ స్టార్క్ మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చింది.
మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా.. మిచెల్ స్టార్క్ చేతి వేలికి గాయమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ చేసిన బంతిని నిలువరించే క్రమంలో మిచెల్ స్టార్క్ చేతికి గాయమైంది. దాంతో ఎడమచేతి చూపుడు వేలి నుంచి రక్తం కారుతున్నా.. ఫ్యాంట్‌కి ఆ రక్తాన్ని తుడుచుకుంటూ మిచెల్ స్టార్క్ తన బౌలింగ్‌ని కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్‌తో కేవలం 5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించడం లేదు. రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించిన మిచెల్ స్టార్క్‌పై ఆ దేశ అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.. కమిట్‌మెంట్ అంటే ఇదీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Latest Sports News, Cricket News, Telugu News