నిజానికి ‘డాన్ శీను, బలుపు, క్రాక్’ వంటి సినిమాలతో గోపీచంద్‌ను కెరీర్ మొదటి నుంచి ప్రోత్రహించింది మాస్ మహరాజ్ రవితేజ. ఈ నేపథ్యంలో గోపీచంద్ నెక్స్ట్ సినిమా తనతోనే ఉంటుందని ఇండస్ట్రీలో రూమర్స్ వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసేందుకు గోపీచంద్ ఆసక్తిగా ఉన్నాడు. అంతేకాదు ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో ఇప్పటికే మెగాస్టార్‌ను ఇంప్రెస్ చేసి ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడనే టాక్ నడుస్తోంది. అయితే చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత వెంకీ కుడుములకు ఓకే చెప్పాడు. కానీ ఈ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ‘భోళా శంకర్’ షూటింగ్ పూర్తయితే తప్ప ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఇదిలా ఉంటే, చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో వివి వినాయక్, పూరీ జగన్నాథ్ వంటి సీనియర్ డైరెక్టర్లకు కూడా మంచి కథతో వస్తే సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పూరీ చెప్పిన స్టోరీ లైన్ చిరంజీవికి నచ్చినప్పటికీ.. ఫుల్ నెరేషన్‌కు ఇంప్రెస్ కానట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్‌తో సినిమా ఆలోచనను మెగా క్యాంప్ విరమించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జగన్.. బాలకృష్ణ లేదంటే రామ్ పోతినేని వైపు చూస్తున్నట్లు సమాచారం.
- Read Latest Tollywood Updates and Telugu News