Friday, March 24, 2023

Diabetes and cancer : షుగర్ ఉన్నవారికి ఈ క్యాన్సర్ వస్తుందట.. జాగ్రత్త..

షుగర్ వ్యాధి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ కారణం. ఇది 1.5 నుండి రెండు రెట్లు ఈ ప్రమాదాన్ని పెంచుతుందని ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు కనుగొన్నాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ అనేది ధూమపానం, దీర్ఘకాలిక ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కుటుంబ చరిత్ర, ఊబకాయం, కొన్ని జన్యు సిండ్రోమ్స్ కూడా ఉంటాయి.

వీరికే ప్రమాదం ఎక్కువ..

వీరికే ప్రమాదం ఎక్కువ..

ఆర్ఎస్ఎస్‌డిఐ మాజీ కమిటీ మెంబర్ డాక్టర్ మనోజ్ చావ్లా ప్రకారం.. ఐదేళ్ళకు పైగా షుగర్ ఉన్నవారికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కాస్తా ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకి లివర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, 50 ఏళ్ళ తర్వాత మొదటిసారిగా షుగర్ ఉన్న వ్యక్తులకు డయాబెటిస్ వచ్చాక..అది మూడు సంవత్సరాలలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌గా మారే అవకాశం 1 శాతంగా ఉంది. ఈ సందర్భాల్లో షుగర్ ప్యాంక్రియాటిక్ ట్యూమర్ ద్వారా వస్తుంది.

డయాబెటిస్ ఎందుకొస్తుంది..

డయాబెటిస్ ఎందుకొస్తుంది..

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి కణాలను ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి రియాక్ట్ అవ్వకుండా చేస్తుంది. దీంతో డయాబెటిస్ వస్తుంది. ముఖ్యంగా, ప్యాంక్రియాటిక్ న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్స్‌కి షుగర్ ఓ లక్షణం, ప్రమాదకారకం కాదు. అయినప్పటికీ ఈ కణితులు ప్యాంక్రియాస్ హార్మోన్ ఉత్పత్తి చేసే కణాల నుండి అభివృద్ధి చెందుతాయి.

టెస్టులు అవసరం..

టెస్టులు అవసరం..

కొత్తగా షుగర్ నిర్దారణ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కి మొదటి సంకేతం. దీని వల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకునేలా చేస్తుంది. డయాబెటిక్స్ గుర్తించబడని ప్యాంక్రియాటిక్ ట్యూమర్‌ని కలిగి ఉండొచ్చో లేదో తెలుసుకోవడానికి మరిన్ని టెస్టులు అవసరమని డాక్టర్ చావ్లా సలహా ఇస్తున్నారు.

Also Read : Brugada Syndrome : ఈ సమస్య ఉంటే గుండె సడెన్‌గా ఆగిపోతుందట..

ముందుగా గుర్తిస్తేనే..

ముందుగా గుర్తిస్తేనే..

ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రెండూ కూడా కొన్ని లక్షణాలను సూచిస్తాయి. వీటిని ఈజీగా తగ్గించవచ్చు. అయితే, ఈ రెండింటినీ ముందుగా గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తేనే తగ్గుతాయని గుర్తుంచుకోండి. ప్రతి పేషెంట్స్ వీలైనంత త్వరగా కచ్చితంగా చెక్ చేసుకుని డాక్టర్‌ని కలిసి ట్రీట్‌మెంట్ తీసుకోవడం ముఖ్యం.

Also Read : Morning Routine : రోజూ ఉదయాన్నే ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు దూరం..


గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu News

Latest news
Related news