విశాఖ వేదికగా నిర్వహించబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సిద్ధమైంది. మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సుకు సాగర తీర నగరంలో విస్తృ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో.. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు భాగస్వామ్యం కాబోతున్నాయి. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, కేఎం బిర్లా, సజ్జన్ జిందాల్, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్‌తో పాటూ పలువురు ప్రముఖులు తొలి రోజు జరిగే ప్రారంభ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సదస్సు కోసం ప్రపంచ దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున పాల్గొంటారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరుకాగా… కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు పాల్గొంటారు. మార్చి 28–29 మధ్య ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశం ఉంటుంది.
BREAKING NEWS