Himanta Biswa Sarma: ప్రతీరోజు పర్యటన
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరపడిన నాటినుంచి దాదాపు ప్రతీరోజు హిమంత శర్మ అస్సాం రాజధాని గువాహటి నుంచి ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఫ్లైట్ లో వెళ్లేవారు. నాగాలాండ్ లో నీఫ్యూ రియోకు మద్దతిచ్చి, అధికారం పంచుకున్నా, త్రిపుర (Tripura) లో అనూహ్యంగా క్లీన్ ఇమేజ్ ఉన్న మానిక్ సాహ (Manik Saha) ను పార్టీ తరఫున తెరపైకి తీసుకువచ్చినా.. మేఘాలయలో తమతో పొత్తు ను వద్దనుకుని ఒంటరిగా పోటీ చేసి మెజారిటీకి దగ్గరగా వచ్చిన ఎన్పీపీ నేత కన్రాడ్ సంగ్మా (Conrad Sangma)ని మళ్లీ తమతో పొత్తుకు సిద్ధమయ్యేలా చేసినా.. అన్నీ హిమంత శర్మ (Himanta Biswa Sarma) వ్యూహాల్లో భాగమే. ఎన్పీపీకి సంపూర్ణ మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన నేపథ్యంలో, ఈ కౌంటింగ్ కు ముందే, రెండుసార్లు స్వయంగా గువాహటి వెళ్లి అస్సాం సీఎం హిమంత శర్మతో కన్రాడ్ సంగ్మా ప్రత్యేకంగా సమావేశమవడం గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం.