Sunday, April 2, 2023

TS ICET 2023 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే

TS ICET 2023 notification : ఈ విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి టీఎస్‌ ఐసెట్‌ (TS ICET 2023) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా నోటిఫికేషన్‌ ప్రకారం.. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.550.. ఇతరులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

TS ICET 2023 ప్రవేశ పరీక్ష ఇలా :

  • టీఎస్‌ ఐసెట్‌ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు.
  • 26న మొదటి సెషన్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెషన్‌ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, నాలుగో సెషన్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
  • 14 ప్రాంతీయ కేంద్రాలు, సుమారు 75 పరీక్షకేంద్రాలను కూడా గుర్తించారు.
  • ప్రాథమిక కీని జూన్‌ 5న విడుదల చేస్తారు.
  • ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్‌ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది.
  • ఫలితాలు జూన్‌ 20న విడుదల చేస్తారు.


25 శాతం అర్హత మార్కులు
టీఎస్‌ ఐసెట్‌ (TS ICET 2023)లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు లేవని.. మిగతా కేటగిరీలవారికి అర్హత మార్కులు 25% గా నిర్ణయించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్‌.లింబాద్రి లింబాద్రి తెలిపారు. సిలబస్, మోడల్‌ పేపర్, సూచనలు, ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ విధాన, ఆన్‌లైన్‌ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్‌ టెస్టుల సమాచారం https://tsicet.nic.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ పి.వరలక్ష్మి పేర్కొన్నారు.

Latest news
Related news