Monday, March 20, 2023

Sreeleela: విజయ్ దేవరకొండతో శ్రీలీల రొమాన్స్.. కొత్త కాంబోపై ఫ్యాన్స్ ఇంట్రెస్ట్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఒక స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. దీనికి ప్రస్తుతం ‘VD 12’ అని టెంపరరీగా ఓ పేరు పెట్టారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించని ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ధమాకా బ్యూటీతో

‘ధమాకా’ సినిమాతో తెగ ఫేమస్ అయిపోయిన హీరోయిన్ శ్రీలీల.. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులను సెలక్ట్ చేస్తున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవరకొండ- శ్రీలీల కాంబినేషన్‌పై ఫ్యాన్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Indian 2: ఇండియన్ 2లో లేను.. పాకిస్థాన్ 3లో లేను: వెన్నెల కిశోర్
పోస్టర్ అదుర్స్

అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్‌ను విజయ్ చేయబోతున్నాడట. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌ ఆకట్టుకుంది. ఇందులో ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిలా కనిపిస్తున్నాడు. పోస్టర్ మీద “I don’t know where I belong, to tell you whom I betrayed – Anonymous Spy” అని రాసుంది. దీంతో పాటు సముద్రతీరంలో మంటల్లో దగ్ధమవుతున్న పడవలతో పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది.

రెండు సినిమాలు

ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న గౌత‌మ్ తిన్న‌నూరి ఇప్ప‌టి వ‌ర‌కు ‘మ‌ళ్ళీరావా’, ‘జెర్సీ’ రెండు సినిమాలు చేశాడు. కానీ రెండు సినిమాలతో క్యాలిబర్ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాకు జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు ద‌క్కింది. అయితే త‌ర్వాత గౌతమ్- రామ్ చ‌ర‌ణ్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుంద‌ని ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏం జరిగిందో తెలీదు కానీ.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో గౌత‌మ్ తిన్న‌నూరి.. విజ‌య్ దేవ‌కొండ‌ను ట్రాక్‌లో పెట్టి ఈ కథను ఓకే చేయించాడు.

ఈ కథ దేవరకొండకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేశాడు. ఈ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్‌ ఎక్కాలని రౌడీ బాయ్ కసిగా ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా విజయ్‌ ఆశలపై నీళ్లు జల్లింది. ప్యాన్ ఇండియా లెవల్లో తీసిన సినిమా డిజాస్టర్ అయింది. దీంతో తన తర్వాతి సినిమాలపై విజయ్ ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం సమంతతో విజయ్ దేవరకొండ చేస్తున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ కాస్త పెండింగ్‌లో ఉంది.

Latest news
Related news