Renuka Chowdary Comments On YCP Govt: ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె… అమరావతి రైతులు సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయినా కూడా సీఎం జగన్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏపీలో పాలన చూస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందంటూ దుయ్యబట్టారు. రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
BREAKING NEWS