Your EMIs may pinch more: ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు రెపో ఆధారిత వడ్డీ రేట్లను పెంచేశాయి. దీంతో కస్టమర్లపై పెను భారం పడుతోంది. ఈఎంఐలు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఇక తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) MCLR రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచగా ఇది మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
6 Percent DA for Bengal govt employees: పశ్చిమ్ బంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీలు, పురపాలక సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు.. 6 శాతం కరవు భత్యం మార్చి 1 నుంచి అందుకోనున్నారు.
Deadline for PAN Aadhaar linkage: ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడం. దీనికి చివరి తేదీ మార్చి 31. ఆలోగా ఈ రెండింటినీ లింక్ చేయకుంటే.. నిరుపయోగంగా మారిపోతాయి. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Changes in train schedule: ఇక నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. వారికి అత్యంత కీలకమైన ట్రైన్ టైం టేబుల్ మారనుంది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రైన్ షెడ్యూల్.. ఈ మార్చిలో విడుదలయ్యే అవకాశముంది.
Bank holidays: ఇక మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇందులో హోలీ పండగ సహా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇక పలు ప్రాంతాల్లో అక్కడి పండగలను బట్టి స్థానికంగా కూడా సెలవులు ఉండనున్నాయి. బ్యాంకులు మూతపడినా.. ఆన్‌లైన్, నెట్‌బ్యాంకింగ్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.
Terms of social media use: ఇక కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు మార్చిలో ఎప్పుడైనా అమల్లోకి వచ్చే అవకాశముంది. ఇవి అమలైతే గనుక ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తప్పుడు ప్రకటనలు, అప్‌డేట్లు చేస్తే ఫైన్ కట్టాల్సి వస్తుంది. అవసరమైతే చట్టపర చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
- Read Latest Business News and Telugu News