Sunday, April 2, 2023

Oil massage: తలకు నూనె అప్లై చేసేప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? – know do’s and don’ts while applying oil to hair

Oil massage: జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా, ఒత్తుగా పెరగాలంటే తలకు తరచుగా నూనె పెట్టాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మన అమ్మల కాలం నుంచి జుట్టు వేగంగా, పొడవుగా పెరగాలంటే.. నూనె రాసుకునేవారు. తలకు చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను పెట్టడితే.. జుట్టు తొందరగా తెల్లపడదు. తలలో ఏర్పడే చుండ్రు, ఫంగస్‌ సమస్యలు దూరం అవుతాయి. మనం కూడా తలకు రకరకాల నూనెలు అప్లై చేస్తూ ఉంటాం. అయితే నూనె రాసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా జుట్టు రాలే సమస్య పెరగుతుంది. తలకు ఆయిల్‌ మసాజ్‌ చేసేప్పుడు ఎలా చేయాలి? ఏమి చేయకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

జుట్టుకు ఏ నూనె అప్లై చేయాలి..?

జుట్టుకు ఏ నూనె అప్లై చేయాలి..?

కొబ్బరినూనె..

కొబ్బరినూనెను చాలా మంది జుట్టుకు అప్లై చేస్తారు. ఈ నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొబ్బరి నూనె ఫ్యాటీ యాసిడ్స్ పవర్‌హౌస్. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది, జుట్టుకు తేమను అందించి సిల్కీగా మారుస్తుంది.

ఆముదం..

ఆముదం..

ఆముదం కొంచెం జిగటగా ఉండటం వల్ల దీన్ని ఉపయోగించడానికి, చాలా మంది ఇష్టపడరు. కానీ, ఆముదం జుట్టు ఎదుగుదలకు చాలా మంచిది. ఇది జుట్టు కదుళ్లను దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపించగలదు. కేశాలు నల్లగా, దట్టంగా పెరిగేలా చేస్తుంది.

ఆలివ్‌ ఆయిల్‌..

ఆలివ్‌ ఆయిల్‌..

జుట్టుకు ముఖ్యమైన నూనెలలో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఆలివ్ నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది జుట్టుకు మంచి మెరుపును, పోషణను ఇస్తుంది. జుట్టును మృదువుగా ఉంచుతుంది.

బాదం నూనె..

బాదం నూనె..

బాదం నూనె జుట్టుకు ఉత్తమమైన నూనెలలో ఒకటి. ఇది జుట్టును సిల్కీగా ఉంచుతుంది. హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది. జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది. బాదం నూనె జుట్టు కుదుళ్లను బలంగా మార్చి.. హెయిర్‌ ఫాల్‌ తగ్గిస్తుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

జుట్టుకు నూనె అప్లై చేసే ముందు.. జుట్టు మూలాలు, జుట్టు చివర్లు శుభ్రంగా ఉండాలి. మీ చేతులు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మీ వెంట్రుకలు, చేతులు మురికిగా ఉంటే.. నూనె అప్లై చేయకూడదు. తల మురికిగా ఉన్నప్పుడు.. నూనెతో తలకు మసాజ్‌ చేస్తే జుట్టు కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోతాయి. నూనె మూలల్లోకి ప్రవేశించదు. దీని వల్ల నూనె రాసినా ప్రయోజనం ఉండదు.

మసాజ్‌ ఇలా చేయవద్దు..

మసాజ్‌ ఇలా చేయవద్దు..

అయిల్‌ మసాజ్‌ వల్ల.. పోషకాలు జుట్టు కుదుళ్లకు పోషకాలు చేరతాయి, తలలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీనితో జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది. కానీ, కొంతమంది ఆయిల్‌ మసాజ్‌ చేసేప్పుడు, మొరటు పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. తలకు నూనె అప్లై చేసి, అతి వేగంగా నొక్కుతూ, గట్టిగా మర్దన చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే.. ఇప్పటికే బలహీనంగా ఉన్న మీ జుట్టు మరింత అలసిపోతుంది. నూనె రాసుకున్న తర్వాత చాలా వరకు జుట్టు రాలిపోతుంది. అలాగే బలహీనమైన వెంట్రుకలు మీ షాంపూ చేసిన తర్వతా రాలతాయి. మీరు తలకు మసాజ్‌ చేసేప్పుడు చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్‌ చేయండి. (image source – pexels)

ఎక్కువగా రాయకండి..

ఎక్కువగా రాయకండి..

కొంతమంది తలకు నూనె అప్లై చేస్తే మంచిదని.. ఎక్కువగా నూనె పెడుతూ ఉంటారు. కానీ ఇలా నూనె అప్లై చేయడం మంచిది కాదు. మీరు ఎక్కువ నూనె అప్లై చేస్తే.. మీ జుట్టుకు అవసరమైన దానికంటే ఎక్కువ షాంపూతో మీ తలని శుభ్రం చేసుకోవాలసి ఉంటుంది. అప్పుడే నూనె పోతుంది. ఎక్కువ షాంపూ వాడటం వల్ల.. జుట్టు పొడిబారుతుంది. కాబట్టి నూనె సరిపడా అప్లై చేసుకోవడం మంచిది. (image source – pexels)

ఇలా అప్లై చేయండి..

ఇలా అప్లై చేయండి..

మీరు జుట్టుకు ఆయిల్‌ అప్లై చేసే ముందు.. నూనెను గోరువెచ్చగా వేడి చేయండి. గోరువెచ్చని నూనెను రాసి వృత్తాకారంలో మసాజ్ చేయండి. తర్వాత ఒక పాత్రలో నీటిని మరిగించి, ఆ నీటిలో టవల్‌ను ముంచి, వేడిగా ఉన్నప్పుడే బాగా పిండాలి. ఈ వెచ్చని టవల్‌ను తలపై గట్టిగా కట్టాలి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. వారానికి రెండు సార్లు తలకు నూనెతో మసాజ్ చేయడం మంచిది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Latest news
Related news