రీసెంట్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు పాటకు తారక్ (Jr NTR), నేను ఎక్కడైనా డాన్స్ చేసేందుకు ఇష్టపడతాం. అయితే ఇలాంటి పెర్ఫామెన్స్‌ను ప్రతి ప్లేస్‌లో చేయడం కష్టం. ఒకవేళ మేము ఆస్కార్స్‌లో ఉన్నట్లయితే, ఏదైనా అభ్యర్థనతో పాటు సమయం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు ఎంతో ఇచ్చిన ప్రేక్షకులను అలరించడానికి మించిన ఆనందం మరోటి లేదు మాకు. కానీ వేదికపై మొత్తం పాటను చేయలేం. ఎందుకంటే దీనికి చాలా శ్వాస, శక్తి అవసరం. హుక్ స్టెప్ వరకైతే ఓకే’ అన్నారు.
ఇక ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌ను కైవసం చేసుకుంటే అప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు చరణ్. ముందైతే తాను నమ్మలేనని.. ఎవరైనా తనను లేపి, వెళ్లి అవార్డ్ తీసుకోవాల్సిందిగా వేదికపైకి తోసేయాలని అన్నారు. అయితే, అవార్డ్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటానని.. అలాగే అది మా విజయమని అనుకోనని, భారతీయ చలనచిత్ర పరిశ్రమ సాధించిన విజయంగా భావిస్తానని చెప్పుకొచ్చారు.
నిజానికి కూడా చరణ్, ఎన్టీఆర్ కలిసి ఆస్కార్ వేడుకల్లో కాలు కదిపితే.. ఆ వేదిక ఎలా ఉంటుందన్న ఊహనే అద్భుతంగా ఉంది. ఒకవేళ నిజంగా జరిగితే మాత్రం.. ఆ రాత్రి జాతరను తలపిస్తుందేమో. కాగా.. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని ‘జై హో’ పాటకు గాను AR రెహమాన్‌కు ఆస్కార్ లభించిన విషయం తెలిసిందే.
- Read Latest Tollywood Updates and Telugu News