ఆసుపత్రి ప్రారంభించిన 15 నెలల్లోనే 1150 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చిన పిల్లలకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ , ప్రధానమంత్రి ఆరోగ్య భీమా కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని వివరించారు. ఇలాంటి ఆసుపత్రి రాష్ట్రంలో శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆసుపత్రి ఒక్కటేనన్నారు.
BREAKING NEWS