Friday, March 31, 2023

hdfc bank, EMI మరింత భారం.. Home Loan వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ బ్యాంక్.. రేపటి నుంచే అమలు! – hdfc bank hikes lending rates by 25 bps your home loan emis to increase


Loan EMI: నెల రోజులు కూడా గడవకముందే మరోసారి తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank). రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేసింది. వరుసగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ వినియోగదారులపై భారం మోపుతోంది. హోమ్ లోన్స్‌పై (Home Loan) రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ను పెంచింది. పెరిగిన లోన్ వడ్డీ రేట్లను మార్చి 1 , 2023 నుంచే అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఆర్‌పీఎల్ఆర్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. జనరల్ కస్టమర్లకు హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు 9.25 శాతం నుంచి ప్రారంభం కానున్నాయి.

మీ గృహ రుణంపై వడ్డీ రేట్లు పెరిగినట్లయితే మీ ఈఎంఐ సైతం పెరుగుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్ ప్రకారం వడ్డీ రేట్లు ప్రధానంగా క్రెడిట్ స్కోర్, డెమోగ్రాఫిక్స్, రీపేమెంట్స్ ఆఫ్ అదర్ లోన్స్, రిస్క్ ప్రొఫైల్ వంటి వాటి ఆధారంగా ఉంటాయి. అయితే, క్రెడిట్ స్కోర్ 760 పైన ఉన్న వారికి డిసౌంట్ సైతం అందుబాటులో ఉంది. క్రెడిట్ స్కోర్ 760 పైన ఉన్న వారికి ప్రత్యేక ఆఫర్ కింద్ 8.70 శాతానికే గృహ రుణాలు అందిస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ. ఈ అవకాశం మార్చి 31, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

గత ఏడాది డిసెంబర్ 2022లో రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (RPLR)ను 35 బేసిస్ పాయింట్లు పెంచింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ద్రవ్యోల్బణం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవలే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.5 శాతానికి చేసింది. గత ఏడాది 2022, మే నెల నుంచి ఆరు సార్లు వడ్డీ రేట్లను సవరించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పటి నుంచి మొత్తంగా 250 బేసిస్ పాయింట్లు పెంచింది.

హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ ఇచ్చేందుకు ఏం పరిగణిస్తుంది?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గృహ రుణం తీసుకునేందుకు ప్రధానంగా కస్టమర్ల ఆదాయం, లోను తిరిగి చెల్లించే సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే వినియోగదారుడి వయసు, అర్హతలు, కుటుంబ సభ్యులు, భార్య ఆదాయం, ఆస్తులు, సేవింగ్స్ హిస్టరీ, ఉద్యోగ భద్రత వంటి విషయాలు ప్రభావితం చేస్తాయి.

Also Read: అదానీ సామ్రాజ్యానికి ఆయనే పెద్దన్న.. Vinod Adani ఎవరు? కొన్ని ఆసక్తికర విషయాలు!



Source link

Latest news
Related news