జీఎస్టీ కౌన్సిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో లభ్యమయ్యే రాబ్ (లిక్విడ్ బెల్లం), పెన్సిళ్లు, షార్ప్‌నర్స్‌పై పన్ను రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వార్షికాదాయానికి సంబంధించిన రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్య రుసుమును సైతం హేతుబద్ధీకరించారు. పాన్ మసాలా ఫ్యాక్టరీల పన్ను ఎగవేత, గుట్కా, జీఎస్‌టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటు వంటి రెండు వేర్వేరు మంత్రి వర్గ ఉప సంఘాల సూచనలను ఆమోదించారు. అలాగే 2018 జీఎస్‌టీ చట్టం ప్రకారం.. ఐదేళ్ల కాలానికి రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని చెల్లించినట్లేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇవాళ్టి నుంచి ధరలు తగ్గేవి..
- కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం పెన్సిల్ షార్ప్‌నర్స్‌పై గతంలో ఉన్న 18 శాతం జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించారు. మార్చి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి.
- లిక్విడ్ బెల్లం అయిన రాబ్‌పై 18 శాతంగా ఉన్న జీఎస్‌టీని పూర్తిగా తొలగించారు. అయితే, విడిగా అమ్మినప్పుడు మాత్రమ 0 శాతం వస్తు సేవల పన్ను వర్తిస్తుంది. ఒకవేళ ప్రీ-ప్యాకేజ్ చేసి, లేబుల్ వేస్తే 5 శాతం మేర జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
- ట్యాగ్-ట్రాకింగ్ పరికరం, డేటా లాగర్ వంటి పరికరాలు ఇప్పటికే కంటైనర్లలో లోడ్ చేసి ఉన్నట్లయితే వాటిపై ఐజీఎస్‌టీ ఉండదు.
- ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ నిర్వహించే ప్రవేశ పరీక్షల ఫీజులు తగ్గనున్నాయి (ఎన్‌టీఏ నిర్వహించేవి మాత్రమే).
- 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి జీఎస్‌టీఆర్-9 దాఖలులో ఆలస్య రుసుము హేతుబద్ధీకరించారు. రూ.5 కోట్ల వరకు రోజుకు రూ.50, రూ.5 నుంచి రూ.20 కోట్ల వరకు ఆలస్య రుసుమును రూ.100గా చేశారు.
ధరలు పెరిగే వస్తువులు ఇలా ఉన్నాయి.
- కోర్టు సర్వీసులు
- పాన్ మసాలాలు
- గుట్కా
- నమిలే పొగాకు
- Read Latest Business News and Telugu News