Friday, March 24, 2023

fastest charging phone, Realme GT3: 10 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్.. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్.. విశేషాలివే! – realme gt3 launched as worlds fastest charging phone in mwc 2023


Realme GT3: ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే ఎంతో చికాకు వస్తుంది. ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టినా చాలా సమయం వృథా అవుతుంది. అయితే, ఆ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారికోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ (Realme) సరికొత్త ఫోన్‌న్ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఫోన్ ఛార్జింగ్ నిండుకుంటుందని, కేవలం 10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని తెలిపింది. జీటీ సిరీస్‌లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో (world Mobile Congress 2023) రియల్‌మీ జీటీ3 పేరుతో ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ నేపథ్యంలో రియల్‌మీ జీటీ3 ఫోన్ ఫీచర్లు తెలుసుకుందాం.

ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ రియల్‌మీ జీటీ3 ఫోన్ 240 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్‌గా నిలిచిందని కంపెనీ పేర్కొంది. ఈ సౌకర్యం వల్ల 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టిన 10 నిమిషాల్లోనే ఫుల్ అవుతుందని వెల్లడించింది. రియల్‌మీ జీటీ 3 ఐదు రకాల ర్యామ్ స్టోరేజీ వేరియంట్లలో 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ, 16బీజీ+1టీబీ మార్కెట్లోకి తీసుకొచ్చింది రియల్‌మీ సంస్థ. రియల్‌మీ జీటీ3 ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. కానీ భారత మార్కెట్లో రియల్‌మీ జీటీ3 ఫోన్ ధర రూ.53 వేలు నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, కస్టమర్లకు అందుబాటులోకి ఎప్పుడు తీసుకొస్తారనేది వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో రియల్‌మీ జీటీ2ను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది రియల్‌మీ.

రియల్‌మీ జీటీ3 స్పెసిఫికెషన్స్..

  • ఆండ్రాయిడ్ 13తో రియల్‌మీ యూఐ 4.0 కలిగి ఉంది.
  • 6.74 అంగుళా 1.5కె అమోలెడ్, 144హెర్జ్ రీఫ్రెషర్ రేటు డిస్‌ప్లే ఉంటుంది
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది
  • ఫోన్ వెనకాల 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సార్స్ ఉంటాయి.
  • ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
  • 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 240వాట్ల సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్
  • ఫోన్ వెనుక వైపు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్ 25 రంగులు వెలువరిస్తుంది
  • కాల్స్, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎల్ఈడీ అలర్ట్ వస్తుంది.

Also Read: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. ఇక వారానికి 5 రోజులే!

Also Read: లేఆఫ్స్ వేళ శుభవార్త.. భారత IT Sector నియామకాల్లో జోష్.. ఎగిరిగంతేస్తున్న ఫ్రెషర్స్!



Source link

Latest news
Related news