గతేడాది ఓ కార్యక్రమం కోసం ఆస్ట్రేలియాకు గెస్ట్‌గా వెళ్లినపుడు.. అక్కడ తెలుగువారు కలిసికట్టుగా చేస్తున్న మంచి పనులను దగ్గరి నుంచి చూసినట్లు తెలిపారు. అదే మంచి తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని విష్ణురెడ్డి, శశి కొలికొండను అడిగితే.. మరుసటి రోజే దాదాపు 60 మందికి పైగా వచ్చి ఎలా సాయం చేయాలని అడిగారని గుర్తుచేసుకున్నారు. అయితే అప్పుడు తాను కొన్ని సలహాలు సూచనలు కూడా వారికి ఇచ్చానని చెప్పారు.
‘ఇది జరిగిన 9 నెలల తర్వాత ప్రస్తుతం ఆర్వేన్సిస్ మేనేజింగ్ డైరెక్టర్ సీఇవో శశి కొలికొండ.. ఆర్వేన్సిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సంబంధించిన ఆస్ట్రేలియన్ బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్‌ను ( డైరెక్టర్– గవర్నర్ అండ్ కంప్లేయిన్స్) ఇండియాకు తీసుకొచ్చారు. నన్ను నమ్మి అవసరంలో ఉన్న వారికి సాయడాలన్న ఉద్ధేశ్యంతో వీరంతా ఇండియాకి వచ్చారు. ఇలా నా వల్ల పది కుటుంబాలకు మంచి జరిగినా ఫరవాలేదని పించింది. అందుకే ఆర్వేన్సిస్ కంపెనీకి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌లా పని చేసేందుకు మీ ముందుకొచ్చాను’ అన్నారు అలీ.
ఈ సందర్భంగా మాట్లాడిన శశిధర్ కొలికొండ.. అలీ గారిని కలిసిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం మారిపోయిందన్నారు. తెలుగు వాళ్లకు విద్య– వైద్యం– టెక్నాలజీ రంగాల్లో ఎవరికి ఏ అవసరముంటే ఆ అవసరాన్ని తీర్చాలని టీమ్ మొత్తం పనిచేస్తున్నామన్నారు. ఈ మేరకు మార్చి 3, 4వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇక అలీ లాంటి మంచి వ్యక్తి తమకు, తమ కంపెనీకి అండగా నిలబడటం ఆనందంగా ఉందని బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్ అన్నారు. పేద కుటుంబాలకు తమ సేవలు అందిస్తామని తెలిపారు.
- Read Latest Tollywood Updates and Telugu News