Thursday, March 30, 2023

Sreeleela: మరో క్రేజీ చాన్స్‌… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శ్రీలీల‌

Pawan Kalyan- Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజీ సినిమాల్లో అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ దూసుకెళ్తోంది. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్‌లోకి పెళ్లి సంద‌D చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న ఆమెకు ఇప్పుడు క్రేజీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. గ‌త ఏడాది మాస్ మ‌హారాజా రవితేజ‌తో క‌లిసి ధ‌మాకా సినిమాలో న‌టించింది. ఆ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న SSMB 28లో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

తాజాగా సినీ వ‌ర్గాల్లోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మ‌రో క్రేజీ మూవీలో శ్రీలీల‌ హీరోయిన్‌గా అవ‌కాశం ద‌క్కించుకుంద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ దర్శ‌క‌త్వంలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అనే సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌రుపుకోనుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల‌ క‌నిపించ‌నుంద‌ని టాక్‌. రీసెంట్‌గానే అందుకు సంబంధించిన ఫొటో షూట్‌ను కూడా పూర్తి చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. త‌మిళ చిత్రం తెరి రీమేక్‌లో సినిమా రూపొంద‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తెరి సినిమాను తమిళంలో మక్కీకి మక్కీలాగా కాకుండా పవన్ కళ్యాణ్ పాత్రను పూర్తిగా మార్చేసి, ఆయన్ని కాలేజీ లెక్చరర్ పాత్రలో చూపిస్తూ కథను డిజైన్ చేశారు హరీష్ శంకర్. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు.

ALSO READ: Chiranjeevi: మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాటం ఇంకా శ‌క్తి వంత‌మ‌వుతుంది: చిరంజీవి
ALSO READ:Naatu Naatu: ‘నాటు నాటు’కి వెంకీ మామ అదిరిపోయే డాన్స్‌.. అవార్డులన్నీ రామ్‌ చ‌ర‌ణ్‌కేన‌ట‌
ALSO READ:
ALSO READ: RC 15 Vs ఇండియ‌న్ 2… చ‌ర‌ణ్ సినిమాకు స‌మ‌స్య‌!

Latest news
Related news