Friday, March 24, 2023

Shardul Thakur Marriage | పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ శార్ధూల్ ఠాకూర్.. హల్దీ వేడుకల్లో హుషారుగా డ్యాన్స్

భారత క్రికెటర్ శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొన్నేళ్లుగా మిథాలీ పారుల్కర్‌తో ప్రేమలో ఉన్న శార్ధూల్ ఠాకూర్.. పెద్దల సమక్షంలో ఈ నెల 27న ఆమెని వివాహం చేసుకోబోతున్నాడు. మహారాష్ట్రలోని కర్జత్‌‌లో శనివారం నుంచి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హల్దీ సెలెబ్రేషన్స్‌లో శార్ధూల్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ వేస్తూ కనిపించాడు.

వాస్తవానికి శార్ధూల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్‌కి 2021, నవంబరులోనే ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం భారత్ గడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు ఆడుతుండగా.. ఈ టెస్టు టీమ్‌లోకి శార్ధూల్ ఠాకూర్ ఎంపికవలేదు. అయితే.. మార్చి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది.

ఈ వన్డే సిరీస్‌కి మాత్రం టీమ్‌లోకి శార్ధూల్ ఎంపికయ్యాడు. దాంతో దొరికిన ఈ మూడు వారాల గ్యాప్‌లో పెళ్లి చేసుకోవాలని శార్ధూల్ ఠాకూర్ నిర్ణయించుకున్నాడు. మళ్లీ మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన శార్ధూల్ ఠాకూర్ ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి ఆడబోతున్నాడు.

శార్ధూల్ ఠాకూర్ వివాహ వేడుకలకి కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథుల్ని ఆహ్వానించారట. ఓవరాల్‌గా వివాహ వేదిక వద్ద 200 మంది వరకూ కుటుంబ సభ్యులు, అతిథులు ఉన్నట్లు తెలుస్తోంది. శార్థూల్ ఠాకూర్‌ పెళ్లి చేసుకోబోతున్న మిథాలీ పారుల్కర్ గతంలో మోడలింగ్ చేసింది. ఇప్పుడు థానేలో ఓ స్టార్టప్‌ కంపెనీని రన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news