డెలివరీ..

డెలివరీ టైమ్‌లో స్త్రీ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక్కరికే కాదు.. తల్లీ బిడ్డ విషయంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ఆ సమయంలో స్త్రీలు కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు పాటించాలి.
Also Read : నార్మల్ డెలివరీ తర్వాత ఈ సమస్యలు వస్తాయట..
డెలివరీ తర్వాత శృంగారం..

శృంగారం అనేది అందరికీ ముఖ్య విషయమే. అయితే, ఇది అన్ని వేళలా కుదరకపోవచ్చు. ఇక డెలివరీ తర్వాత ఆడవారి బాడీ సున్నితంగా మారుతుంది. అలాంటి సమయంలో శృంగారం చేయొచ్చా అంటే.. అది ఆడవారి శరీరతత్వంపై ఆధాపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే వారికి నార్మల్ డెలివరీ జరిగిందా.. లేదా సిజేరియన్ జరిగిందా గుర్తించి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
నొప్పి..

డెలివరీ తర్వాత కొద్దిగా నొప్పి అనేది ఎవరికైనా కామన్. ఇది ముఖ్యంగా సి సెక్షన్‌లో ఉంటుంది. వారికి సిజేరియన్ జరిగినప్పుడు ఓ వారం తర్వాత నుంచి 3, 4 వారాల వరకూ కొద్దిగా నొప్పి ఉంటుంది.
Also Read : Pregnancy Diet : ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇవి కచ్చితంగా తినాలి..
బ్లీడింగ్..

అదే విధంగా బ్లీడింగ్ కూడా 6 నుంచి 12 వారాల వరకు ఉంటుందని.. ఈ సమయంలో మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెబుతున్నారు నిపుణులు. అయితే, అందరికీ ఇది ఒకేలానే ఉండకపోవచ్చు. కాబట్టి, ఆ విధంగా చూసుకోవాలి.
అన్ని చూసుకున్నాకే..

ఈ విషయాల్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే మీ పార్టనర్‌తో కంఫర్ట్‌గా ఉంటే వారితో మాట్లాడి మీ డాక్టర్‌తో చర్చించాక శృంగారంలో పాల్గొనొచ్చు. ఆడవారిలో మైనారిటీ 6 నుంచి 8 వారాల్లో తమ లైంగిక జీవితాన్ని స్టార్ట్ చేస్తే మెజారిటీగా 12 వారాల తర్వాత ప్రారంభమవుతుంది.
-By Dr. Durga Prasad B, Consultant Urologist, Andrologist, Robotic & Renal Transplant Surgeon, Yashoda Hospitals, Hyderabad
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu News