పీఎం కిసాన్ 12 విడత సాయాన్ని గత ఏడాది 2022, అక్టోబర్‌లో విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత నాలుగు నెలలకు ఇప్పుడు 13 విడత నిధులను అందించింది. అలాగే.. 11 విడత నిధులు మే, 2022లో రైతుల ఖాతాల్లో జమ చేశారు. పీఎం కిసాన్ సాయం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా రూ.6 వేల సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల మధ్య ఈ నిధులను జమ చేస్తూ వస్తోంది కేంద్రం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (PM Kisan Samman nidhi) ఫిబ్రవరి, 2019లో ప్రవేశపెట్టింది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. అయితే, ఈ పథకాన్ని డిసెంబర్, 2018లోనే ప్రకటించారు. 13 విడత నిధుల విడుదల సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ సెక్రెటరీ మనోజ్ అహుజా హాజరయ్యారు. బెళగావి కార్యక్రమంలో పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. సుమారు రు.190 కోట్లతో దీనిని అభివృద్దఇ చేశారు. అలాగే లోండా-బెళగావి-ఘటప్రభా సెక్షన్ల మధ్య డబుల్ లైన్స్ సైతం ప్రారంభించారు.
స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?
- అర్హులైన రైతులు తమ స్టేటస్ తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లాలి.
- ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ ఎంచుకోవాలి
- ఆ తర్వాత బెనిఫిసియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూర్తి చేయాలి
- ఆ తర్వాత గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేయాలి
- పూర్తి వివరాలు అందించిన తర్వాత మీ వివరాలు డిస్ప్లే అవుతాయి.
- మరోవైపు.. హెల్ప్‌లైన్ నంబర్‌లు 155261 లేదా 011-24300606 కాల్ చేసి సైతం స్టేటస్ తెలుసుకోవచ్చు.