‘నాకు అద్భుతమైన వైవాహిక జీవితం లభించింది. నా భార్య నాకు సంపూర్ణ మద్దతునిచ్చే మంచి మిత్రురాలు. మేము మంచి భాగస్వాములమయ్యాం. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమెను కాపాడేందుకు సర్వశక్తుల ప్రయత్నించాను కానీ ఫలితం లేకపోయింది. 2018లో ఆమె మరణానంతరం నేను ఒంటరినైపోయాను. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. 65 ఏళ్ల భాగస్వామ్యం తర్వాత భార్యను కోల్పోతే గతంలో ఉన్నట్లుగా ఉత్సాహంగా ఉండలేరు. 90 ఏళ్లు వచ్చాక లిస్టెడ్ కంపెనీలో యాక్టివ్ మేనేజ్‌మెంట్ రోల్ నుంచి తప్పుకోవాలని నమ్మాను. ఇక నా కుమారుడు కంపెనీని టేకోవర్ చేసుకోవాలని భావించాను. డీఎల్ఎఫ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో నా కుమారుడు మంచి పనితీరును కనబరుస్తున్నాడు.’ అని పేర్కొన్నారు డీఎల్ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్.
తన భార్య మరణించడానికి 6 నెలల ముందు ఓ రోజు తనతో మాట్లాడిందని, జీవితంలో చేస్తున్న ఏ పనినీ వదిలేయవద్దని కోరినట్లు చెప్పారు కేపీ సింగ్. ‘ నీ శక్తి వంచన లేకుండా నా కోసం ప్రయత్నించావు. ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలిపోకూడదు కానీ నా విషయంలో భిన్నంగా జరిగింది. కొన్ని నెలల్లో నేను నిన్ను వదిలి వెళ్లి పోతున్నా. నేను వదిలి వెళ్లినా.. నీ ముందు చాలా జీవితం మిగిలే ఉంది. నాకో మాట ఇవ్వు. నా తర్వాత కూడా నీ జీవితంలో నిరాశ ఉండకూడదు. ఈ జీవితం మళ్లీ నీకు తిరిగిరాదు’ అని కోరినట్లు సింగ్ వెల్లడించారు. 2018లో ఇందిర మరణం తర్వాత దాదాపు రెండేళ్లు ఒంటరితనంలో జీవించినట్లు చెప్పారు కేపీ సింగ్.
రెండేళ్ల తర్వాత తనకు ఓ జీవిత భాగస్వామి దొరికినట్లు చెప్పారు కేపీ సింగ్. ‘ నేను చాలా అదృష్ట వంతుడిని, ఒక మనోహరమైన వ్యక్తిని కలిశాను. ఇప్పుడు ఆమె నా భాగస్వామి, తన పేరు షీనా. నా జీవితంలో కలిసిన అత్యుత్తమ వ్యక్తులో ఒకరు. చాలా హుషారుగా ఉంటూ నన్ను ఎప్పుడూ హుషారుగా ఉంచుతారు. ఆమెకు వరల్డ్‌లో చాలా మంది అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. నేను ఎప్పుడైన నిరాశకు గురైతే.. ఆమె నన్ను ప్రోత్సహిస్తుంది. నేను ఈరోజు ఇంత ఉత్సాహంగా ఉన్నానంటే ఆమెనే కారణం. ‘ అని తెలిపారు కేపీ సింగ్.
- Read Latest Business News and Telugu News