మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం పంపిణీలో భాగంగా.. 51,12,453 మంది రైతులకి రూ. 1,090.76 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేశారు. అలాగే… గతేడాది మాండమస్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతు కుటుంబాలకు రూ.76.99 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేసింది. పెట్టుబడి సాయంతో పాటే పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. 91,237 మంది రైతులు ఇన్ పుట్ సబ్సిడీ అందుకున్నారు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ ద్వారా… రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోన్న విషయం తెలిసిందే.
BREAKING NEWS